అమెరికాలోని అద్భుతమైన లొకేషన్స్ లో "గూఢచారి" షూటింగ్ !!

అమెరికాలోని అద్భుతమైన లొకేషన్స్ లో "గూఢచారి" షూటింగ్ !!
ప్రొడక్షన్ డిజైన్ : శివం రామ్
ఎడిటర్ : గ్యారీ బీహెచ్
సినిమాటోగ్రఫీ : షానిల్ డియో
మాటలు : అబ్బూరి రవి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సహ నిర్మాత : వివేక్ కూచిభోట్ల
నిర్మాతలు : అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్
కథ : అడివి శేష్
దర్శకత్వ౦ : శశికిరణ్ తిక్క 
"క్షణం" లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "గూఢచారి". పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వము లో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్  సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. మిస్ ఇండియా మరియు తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. 
ఈ సందర్భగా నిర్మాతలు అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్  మాట్లాడుతూ.. "ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్ తో "గూఢచారి" తెరకెక్కుతోంది. డిల్లీ, పూణే, హైద్రాబాద్, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, చిట్టగాంగ్ (బంగ్లాదేశ్ లలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలోని కాస్కేడ్ మౌంటైన్స్ లో జరుగుతోంది. అక్కడి అందమైన, అత్యద్భుతమైన లొకేషన్స్ లో అడివి శేష్ షూట్ చేస్తున్నారు. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. విడుదలై ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.  హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. వేసవి కానుకగా "గూఢచారి" చిత్రాన్ని విడుదల చేయనున్నాం" అన్నారు.