గూఢచారి మూవీ రివ్యూ

గూఢచారి మూవీ  రివ్యూ

నటీనటులు : అడివి శేష్‌, శోభిత ధూళిపాళ్ల, ప్రకాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, మధు శాలిని

సినిమాటోగ్రఫీ : షానియల్‌ డియో 

ఎడిటింగ్‌ : గ్యారీ 

కథ, రచన : అబ్బూరి రవి, అడివి శేష్‌ 

సంగీతం : శ్రీ చరణ్‌ పాకాల 

దర్శకత్వ : శశి కిరణ్‌ టిక్కా 

బ్యానర్‌ : అభిషేక్‌ పిక్చర్స్‌ 

నిర్మాత : అభిషేక్‌ పిక్చర్స్‌ 

అడివి శేష్  క్షణం సినిమాతో నటుడిగానే కాకుండా సూపర్ హిట్ రచయితగా కూడా మంచి పేరు తెచుకున్నాడు.  ‘గూఢచారి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అడివి శేష్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.

కథ : గోపి (అడివి శేష్‌) ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు. గోపి చిన్నతనంలోనే సిక్కింలో జరిగిన ఓ ఆపరేషన్‌లో రఘువీర్‌ చనిపోతాడు. దీంతో రఘువీర్‌ స్నేహితుడు సత్య (ప్రకాష్ రాజ్‌), గోపికి ప్రాణ హాని ఉందని అతడి ఐడెంటిటీ మార్చి అర్జున్‌ కుమార్‌ పేరుతో పెంచి పెద్ద చేస్తాడు. అర్జున్‌ ఎన్ని ఉద్యోగాలు వచ్చిన రిజెక్ట్ చేస్తూ దేశ రక్షణలో తన తండ్రిలా భాగం కావాలనుకుంటాడు. 

174 సార్లు అప్లై చేసిన త‌ర్వాత 175వ సారి ‘రా’ విభాగంలోకి అర్జున్ సెల‌క్ట్ అవుతాడు. దేశ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దులు దాటి ప‌నిచేసే ‘రా’ లో త్రినేత్ర విభాగంలో అర్జున్ జాయిన్ అవుతాడు. అదే స‌మ‌యంలో సైకాల‌జిస్ట్ స‌మీర(శోభితా దూళిపాళ‌)తో ఏర్ప‌డ్డ పరిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అర్జున్‌ దేశం దృష్టిలో ఒక తీవ్రవాదిగా ముద్రింపబడతాడు. త్రినేత్ర ఏజెన్సీ కూడా అర్జున్‌ను వెంబడిస్తుంది. అర్జున్‌పై తీవ్రవాది అనే ముద్ర ఎలా పడింది? అందు కోసం ఆయన చేసిన సాహసాలు ఏంటి? చివరకు అర్జున్‌ ఆ ముద్రను ఎలా చెరిపేసుకున్నాడు? అనేది చూడాలి.

విశ్లేషణ : ఎన్నో చిక్కుముడులతో తయారు చేసుకున్న బాండ్‌ కథను ఏమాత్రం కన్ఫ్యూజన్‌ లేకుండా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే రొమాంటిక్ సీన్స్‌ కాస్త బోరింగ్  గా అనిపించినా.. సెకండ్‌ హాఫ్‌లో ఆ సీన్స్‌కు ఉన్న కనెక్షన్‌ చూసిన తరువాత లవ్‌ సీన్స్‌ కూడా ఓకె అనిపిస్తాయి. హీరో, హీరోయిన్ మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు.. మ‌ధ్య మ‌ధ్య‌లో హీరోను ఎవ‌రో అబ్జ‌ర్వ్ చేయ‌డం.. ఇంట‌ర్వెల్ ముందు ప్లాన్ చేసి హీరోని ఇరికించ‌డం.. అన్ని ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. చివర్లో దేశభక్తి, సెంటిమెంట్‌ మేళవించిన క్లైమాక్స్‌ రాసుకుని, ఒక జేమ్స్‌ బాండ్‌ తరహా కథకు, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు అందివ్వగలిగాడు దర్శకుడు. 

ప్లస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే

                         కథ 

మైనస్ పాయింట్స్ : సంగీతం 

రేటింగ్ : 3.5/5