డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ఫస్ట్ లుక్ విడుదల !

డైరెక్టర్ మారుతి 'బ్రాండ్ బాబు' ఫస్ట్ లుక్ విడుదల !
నటీనటులుసుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్య రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్.
స్టోరి : మారుతి
డైరెక్టర్ : ప్రభాకర్.పి
నిర్మాత : ఎస్. శైలేంద్ర
బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
మ్యూజిక్ : జేబి
లిరిక్స్ : పూర్ణచెర్రీ
కెమెరామెన్ : కార్తీక్ ఫలణి
ఎడిటర్ : ఉద్ధవ్ ఎస్.బి
ఆర్ట్ డైరెక్టర్ : మురళి ఎస్.వి
బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతో పాటు సమర్పిస్తున్నారు. 

సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వ వహిస్తున్నారు. నటుడు మురళి శర్మ  ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్య రాజేష్, పి.సాయికుమార్ నటిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. జీవన్ బాబు (జే. బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.  శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.