దేశముదుర్స్ చిత్రం మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

దేశముదుర్స్ చిత్రం మోషన్  పోస్టర్ ను ఆవిష్కరించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
M K ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బేనర్ లో  కన్మణి దర్శకత్వలో , కుమార్ నిర్మించిన “ దేశముదుర్స్ “ చిత్రం మోషన్ పోస్టర్ ని దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు విడుదల చేసారు . ఈ సందర్బగా
రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ...మోషన్ పోస్టర్ చాలా ఇమ్ ప్రసివ్ గా ఉంది , పోసాని , పృథ్వి కాంబినేషన్ లో రూపొందిన ఈ కామెడీ కాంబో తప్పకుండా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది చెపుతూ ,  చిత్ర  యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు .
నిర్మాత కుమార్ మాట్లాడుతూ...మా దేశముదుర్స్ చిత్రం వినోదాల విందుగా , జనాలని ఆకట్టుకుంటుంది అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు .
దర్శకుడు కన్మణి మాట్లడుతూ... మంచి కధతో , వినోదమే ప్రదానంగా , ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది . దర్శకేంద్రుడు కే .రాఘవేంద్ర రావు గారు  ఈ దేశముదుర్స్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించడం ఆనందం ఉంది అని అన్నారు . 
ఈ కార్యక్రమానికి , దర్శకుడు కన్మణి, నిర్మాత కుమార్ తో పాటుగా అర్జున్ , గౌతం రాజు , భవాని ప్రసాద్ , అడుసుమిల్లి విజయ్ కుమార్ ,యాజమాన్య , రాంబాబు గోసాల పాల్గొన్నారు . 
పోసాని కృష్ణ మురళీ, పృథ్వి ముఖ్య పాత్రలు పోషించిన, ఈ సినిమాలో అర్జున్ , గాయత్రీ , ఆలీ , శకలక శంకర్ , అశ్విని ....తదితరులు నటించారు .