డియర్ కామ్రేడ్ మూవీ విడుదల తేదీ ఖరారు

డియర్ కామ్రేడ్  మూవీ విడుదల తేదీ ఖరారు

వరుస విజయాలతో టాలీవుడ్‌ లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదుగుతున్న హీరో విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో ఈ సినిమాలో గీత గోవిందంలో నటించిన రష్మిక మరోసారి విజయ్‌తో జోడి కడుతోంది.

ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 22న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ విద్యార్థి నాయకుడిగా నటిస్తుండగా రష్మిక క్రికెట్‌ పాత్రలో కనిపించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో పాటు కాంత్రి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమాతోనూ బిజీగా ఉన్నాడు విజయ్‌.