చిత్రం శీను ప్రధాన పాత్రలొ “ విశ్వదాభిరామ”

చిత్రం శీను ప్రధాన పాత్రలొ  “ విశ్వదాభిరామ”
కథ-కథనం-మాటలు: సురేష్ కాశీ
కెమెరా : అజీమ్, తరుణ్ సోనూ
నిర్మాత : సురేంద్ర కమల్ (సురేంద్ర వంటిపులి)
దర్శకత్వ౦ : సురేష్ కాశీ , సురేష్ కమల్, అశోక్ చక్రం

సొలొ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సురేంద్ర కమల్( సురేంద్ర వంటిపులి) నిర్మిస్తొన్న థ్రిల్లర్ "విశ్వదాభిరామ" . సురేష్ కాశీ, సురేంద్ర కమల్ , అశోక్ చక్రం త్రయం  దర్శకులు. చిత్రం శీను ప్రధాన పాత్రలొ నటిస్తొన్న ఈ చిత్రంలొ  భువన్ తేజ్ , అనిల్ ,ఆనంద్ , సహస్ర, రాజారెడ్డి, మానస లీడ్ రొల్స్ లొ కనిపించనున్నారు.

దర్శకులు  మాట్లాడుతూ. కొండవీటి కోట నేపధ్యలో డెత్ గేమ్ థ్రిల్లర్ విశ్వాదాభిరామ. ఇప్పటివరకు కామెడీ పాత్రల్లొ అలరించిన చిత్రంశీను తొలిసారి  విలన్ గా ఈ చిత్రంలొ నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఇదోక సరికొత్త త్రిల్ ను  కలిగిస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనె సినిమాను విడుదల చెస్తామన్నారు.