చి.ల.సౌ. మూవీ రివ్యూ

చి.ల.సౌ. మూవీ రివ్యూ

తారాగ‌ణం : సుశాంత్‌, రుహానీ శ‌ర్మ‌, వెన్నెల‌కిశోర్‌, అనుహాస‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంజ‌య్ స్వ‌రూప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు

సంగీతం : ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి

క‌ళ‌ : వినోద్ వ‌ర్మ‌

కూర్పు : ఛోటా కె.ప్ర‌సాద్‌

ఛాయాగ్ర‌హ‌ణం : ఎం.సుకుమార్‌

ద‌ర్శ‌క‌త్వ : రాహుల్ ర‌వీంద్ర‌న్‌

నిర్మాణ సంస్థ‌లు : అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ కార్పొరేష‌న్‌

నిర్మాత‌లు : నాగార్జున అక్కినేని, జస్వత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల

అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్‌ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సుశాంత్ సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లోనే తెర‌కెక్కేవి. ఈసారి అందుకు భిన్నగా, త‌న‌కి త‌గ్గ ఓ సున్నిత‌మైన క‌థ‌ని ఎంచుకొని ‘చి.ల‌.సౌ’ చేశాడు. నాగార్జున ఈ చిత్రంలో భాగం కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. 

కథఅర్జున్‌(సుశాంత్‌) ఇర‌వైయేడేళ్ల కుర్రాడు. మంచి ఉద్యోగం చేస్తుంటాడు. అత‌ని త‌ల్లిదండ్రులు(అను హాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్‌) పెళ్లి చేసుకోమ‌ని పోరు పెడుతుంటారు. అర్జున్‌ ఏమో ఐదేళ్ల వ‌ర‌కు పెళ్లి చేసుకోకూడ‌ద‌నే ఆలోచ‌న ఉంటుంది. ఎవ‌రో ఇంటికి వెళ్లి అమ్మాయిని చూసి.. జీవితాంతం క‌లిసి ఉండ‌బోయే అమ్మాయిని ఐదు పది నిమిషాల్లో ఎలా నిర్ణ‌యించుకుంటార‌నేది అర్జున్ వాద‌న‌. ఇంట్లో పోరు సరిపోలేదన్నట్టుగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ సుజిత్‌ (వెన్నెల కిశోర్‌) కూడా అర్జున్‌ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. వీళ్ల పోరు పడలేక ఓ అమ్మాయితో పెళ్లిచూపులుకు ఒప్పుకుంటాడు అర్జున్‌. రొటీన్‌ పెళ్లి చూపులు లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసిన పేరెంట్స్‌. అంజ‌లి త‌న కుటుంబానికి అండ‌గా ఉంటూ ఉద్యోగం చేస్తున్న నేటిత‌రం యువ‌తి. కుటుంబ ప‌రిస్థితుల దృష్ట్యా ఆమెకి పెళ్లి చాలా అవ‌స‌రం. మ‌రి అయిష్టంగానే పెళ్లి చూపుల‌కి ఒప్పుకున్న అర్జున్‌కి అంజ‌లి న‌చ్చిందా? అసలు వాళ్ల పెళ్లి చూపులు ఎలా జరిగింది..? 24 గంట‌ల్లో ఈ ఇద్ద‌రి జీవితాలు ఎలాంటి మ‌లుపులకి గుర‌య్యాయనేది తెర‌పైనే చూడాలి.

విశ్లేషణసుశాంత్ అర్జున్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించాడు. హీరో పాత్ర మ‌న పక్కింటి కుర్రాడిలా ఉంటుంది. ఇక హీరోయిన్ రుహానీ శ‌ర్మ అంజ‌లి పాత్ర‌లో ఒదిగిపోయింది. తండ్రి చిన్న‌ప్పుడే చ‌నిపోయిన ఓ అమ్మాయి.. త‌న కుంటుంబం కోసం ప‌డే క‌ష్టం. త‌న‌కి తెలియ‌కుండానే అంజ‌లి జీవితంతో క‌నెక్ట్ అయిపోతాడు అర్జున్‌. ఆ తర్వాత ప‌రిణామాల‌న్నీ కూడా ఒక‌రి గురించి మ‌రొకరికి తెలిసిపోయేలా చేస్తుంటాయి. దర్శకుడిగా తొలి ప్రయత్నలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్ రవీంద్రన్‌. రొటీన్‌ ప్రేమకథలకు భిన్నగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. 

ప్లస్ పాయింట్స్ : న‌టీన‌టులు

                         సంగీతం

                          క‌థ‌, క‌థ‌నం

మైనస్ పాయింట్స్స్లో నెరేష‌న్‌

రేటింగ్ : 3/5