‘C/o కంచరపాలెం’ మూవీ రివ్యూ

‘C/o కంచరపాలెం’ మూవీ రివ్యూ

నటీనటులు : సుబ్బారావు, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు

సంగీతం : స్వీకర్‌ అగ‌స్తి

ఛాయాగ్ర‌హ‌ణం : ఆదిత్య జ‌వ్వాడి, వ‌రుణ్ ఛాపేక‌ర్

కూర్పు : రవితేజ గిరిజిల

దర్శకత్వం : వెంకటేశ్ మ‌హా

నిర్మాత‌ : విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి

స‌మ‌ర్ప‌ణ‌ : ద‌గ్గుపాటి రానా

కంచెరపాలెం అనే గ్రామంలో అక్కడి ప్రజలతోనే తెరకెక్కించిన ఈ సినిమాను యంగ్ హీరో రానా దగ్గుబాటి తన సమర్పణలో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో C/o కంచరపాలెం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎంతోమంది తారలు, ప్ర‌ముఖులు ఈ సినిమాని చూసి గొప్ప ప్ర‌య‌త్నం అని మెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? అనేది చూద్దాం. 

కథ : రాజు(సుబ్బారావు) కంచరపాలెంలోని గవర్నమెంట్‌ ఆఫీస్‌లో అటెండర్‌. తనకు 49 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. దాంతో అందరూ అతన్ని నట్టుగాడు అని ఎగతాళి చేస్తుంటారు. అదే సమయంలో రాజు పనిచేసే ఆఫీస్‌కి ఆఫీసర్‌గా రాధ(రాధ బెస్సి) వస్తుంది. ఆమె వయసు 42 ఏళ్లు. భర్త చనిపోయుంటాడు. 20 ఏళ్ల కూతురు ఉంటుంది. రాజు మనస్తత్వాన్ని చూసిన రాధ అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అయితే తన కుటుంబం ఏమని అనుకుంటుందోనిన భయపడుతుంటుంది రాధ... అదే ఊరికి చెందిన జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్)ల‌ది మ‌రో క‌థ‌. మ‌తాలు వేరైనా ఆ ఇద్ద‌రూ అనుకోకుండా ప్రేమ‌లో ప‌డ‌తారు. సుందరం (కేశవ కర్రి) స్కూల్ పిల్లాడు. తన క్లాస్‌మెట్‌ సునీత (నిత్య శ్రీ) అంటే సుందరానికి చాలా ఇష్టం. స్నేహితుడి సాయంతో ఎలాగైన సునీతతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాడు. గడ్డం (మోహన్ భగత్‌) వైన్‌ షాపులో పనిచేసే కుర్రాడు. తమ షాప్‌లో రోజు మందుకొనే ఓ వేశ్య సలీమా( విజయ ప్రవీణా పరుచూరి)ను కళ్లు చూసి ప్రేమిస్తాడు.

ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి..? చివరకు వారి కథలు ఎలా ముగిసాయి..? అనేది ఈ చిత్రం.

విశ్లేషణ : ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్నడు దర్శకుడు వెంకటేష్‌ మహా. స్కూల్‌డేస్‌లో ప్రతి ఒక్కరికీ ఓ క్రష్‌ ఉంటుంది. దాన్ని బేస్‌ చేసుకునే దర్శకుడు క్యారెక్టర్‌ను రాసుకున్నాడు. నిర్మాణ పరంగాను సినిమాకు మంచి మార్కులు పడతాయి. తమకున్న లిమిటేషన్స్ మధ్య అద్భుతమైన అవుట్‌ పుట్‌ ఇవ్వటంలో నిర్మాత కృషి ప్రతీఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ప్రేమించిన అమ్మాయి వేశ్య అని తెలిసినా ఆమెతో ముద్దు ముచ్చ‌ట్‌్న్నీ పెళ్లి త‌ర్వాతే అని చెప్పే ఓ ప్రేమికుడుంటాడా? ఇలాంటి ఎన్నో సాహ‌సాలు ఈ సినిమాలో క‌నిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ : న‌టీన‌టుల నటన 

మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ 

రేటింగ్ :3/5