మూవీ రిలీస్ కోసం స్టార్ హీరో ల గొడవ

మూవీ రిలీస్ కోసం స్టార్ హీరో ల గొడవ

సినిమా విడుద‌ల తేదీ గురించి `నా పేరు సూర్య‌`, `భ‌ర‌త్ అను నేను` సినిమాల నిర్మాత‌లు గొడ‌వ ప‌డ్డారు . ఏప్రిల్ 27వ తేదీన త‌మ సినిమాలు విడుద‌ల‌వుతాయ‌ని రెండు సినిమాల నిర్మాత‌లూ ప్ర‌క‌టించారు. వీటికి తోడు మ‌ధ్య‌లో ర‌జినీకాంత్ `కాలా` వ‌చ్చింది. దీంతో వివాదం మ‌రింత పెరిగింది. అయితే పెద్ద వివాదంగా మారుతుంద‌న్న‌కున్న ఈ గొడ‌వ ప‌రిష్కార‌మైంద‌ని వార్త‌లు విన‌బ‌డుతున్నాయి.

రెండు సినిమాల నిర్మాత‌లూ సామరస్యగా ఈ స‌మ‌స్య‌కు పరిష్కారం వచ్చింది అని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. మ‌హేష్ బాబు `భ‌ర‌త్ అను నేను` సినిమాను ఏప్రిల్ 21వ తేదీన విడుద‌ల చేయాల‌ని నిర్ణయించార‌ట‌. అలాగే బ‌న్నీ న‌టించిన `నా పేరు సూర్య‌` సినిమాను మే 5వ తేదీకి మార్చార‌ట‌.