బ్రాండ్‌ బాబు మూవీ రివ్యూ

న‌టీన‌టులు : సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్య రాజేష్, వేణు వై

క‌థ‌ : మారుతి

ద‌ర్శ‌కుడు : ప‌్ర‌భాక‌ర్‌.పి

మ్యూజిక్‌ : జె.బి

లిరిక్స్ : పూర్ణాచారి

కెమెరా : కార్తిక్ ప‌ళ‌ని

ఎడిట‌ర్‌ : ఉద్ధ‌వ్‌

ఆర్ట్ : ముర‌ళి

బ్యాన‌ర్‌ : శ్రీ శైలేంద్ర ప్రొడ‌క్ష‌న్స్

నిర్మాత : శైలేంద్ర బాబు

దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వ వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలా మారుతి మార్క్‌ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రాండ్ బాబు. బ్రాండ్ల‌కు విలువిచ్చేవారు ఎలా ఉంటార‌నే అంశాన్ని సెటైరిక‌ల్‌గా తెర‌కెక్కించారు. ఆ సినిమా ఎలా ఉందో.. ఏంటో ఒక‌సారి చూద్దాం.

కథ : డైమండ్ బాబు (సుమంత్ శైలేంద్ర‌) రిచ్ కిడ్‌. అత‌ని తండ్రి ర‌త్న (ముర‌ళీశ‌ర్మ‌)కు బ్రాండ్ పిచ్చి ఎక్కువ‌. కుటుంబం మొత్తం అలాగే ఉండాల‌ని అనుకుంటాడు. అంద‌రూ అలాగే ఉంటారు కుడా. తన బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి  చేసుకోవాలనుకుంటాడు డైమండ్ బాబు . అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్‌ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. మ‌రి నిజం తెలుసుకున్న డైమండ్ ఏం చేశాడు? త‌న బ్రాండ్‌కి విలువ ఇచ్చి, ఆ అమ్మాయిని వ‌దిలేశాడా? లేదంటే ఆ అమ్మాయి ప్రేమ కోసం బ్రాండ్‌నే వ‌దిలేశాడా? అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేషణ : బ్రాండ్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ క‌థ ఇది. భావోద్వేగాల‌ను లోలోప‌లే దాచుకుని, పైకి హుందాగా ఉండే ఫ్యామిలీ క‌థ‌. హోమ్ మినిస్ట‌ర్ కుమార్తె కోడ‌లిగా వ‌స్తుంద‌నుకున్న చోటికి హోమ్ మినిస్ట‌ర్ ఇంటి ప‌నిమనిషి కోడ‌లిగా వ‌స్తుంద‌ని తెలియ‌డంతో ఏర్ప‌డే క‌న్‌ఫ్యూజ‌న్‌, ఫ్రస్ట్రేష‌న్ ఈ సినిమాలో కీల‌కం. క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌లో సన్నివేశాల్లో ఎమోషన్స్‌ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ  సరిగ్గా సరిపోయింది. నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు. దర్శకుడిగా ఫుల్‌ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. బుల్లితెర మీద స్టార్‌ ఇమేజ్‌ అందుకున్న ప్రభాకర్‌ నెక్ట్స్‌ నువ్వే సినిమాతో దర్శకుడిగా వెండి తెర ఫై ఎంట్రీ ఇచ్చారు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యగా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ : క‌థ‌

                          కామెడీ

                          నిర్మాణ విలువ‌లు

మైనస్ పాయింట్స్ : పాట‌లు

                             సెకం‍డ్‌ హాఫ్‌

రేటింగ్ : 2.5/5



మరిన్ని కథనాలు

'తేజ్‌ ఐ లవ్ యు` ఆడియో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
'తేజ్‌ ఐ లవ్ యు`...
మూగవాడిగా నారా రోహిత్
మూగవాడిగా నారా...
దటీజ్ మహాలక్ష్మిగా రాబోతున్న హీరోయిన్ తమన్నా
దటీజ్...