బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దుల గోల ఏంటో...

బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దుల గోల ఏంటో...

బిగ్ బాస్ సీజన్ 2 74 వ ఎపిసోడ్ లో కూడా పెళ్లి వేడుక అంటూ రాధాక్రిష్ణ, మధులతఅనే రెండు బొమ్మలకు పెళ్లి చేయడం, మెహిందీ ఫంక్షన్, పెళ్లి, సంగీత్ సాగింది.

పెళ్లికి కావాల్సిన బట్టల షాపింగ్ హుషారుగా సాగింది. గణేష్ బట్టల షాపు యజమానిగా వ్యవహరించగా.. కౌశల్, శ్యామల ఓ జంటగా, అమిత్, దీప్తి ఓ జంటగా బట్టలు కొనుగోలు చేశారు. ఈ టాస్క్‌లో దీప్తి, శ్యామల తన నటనతో ఆకట్టుకొన్నారు.

గీతా మాధురి, అమిత్‌లను సీక్రెట్ రూంలోకి పిలిచి మరీ.. పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి. మీరు సంతోషంగా ఉన్నారా? ఇలాగే మీ పాత్రల్లో కంటిన్యూ అవ్వండి అని చెప్పారు బిగ్ బాస్.

సీక్రెట్ టాస్క్‌లో భాగంగా సామ్రాట్, రోల్ రైడా రెండు స్వీటు బాక్సులు తినాలి. గీతా మాధురిని రోల్ రైడా ముద్దు పెట్టుకోవాలి. పూజాను పెళ్లి చేసుకొనేలా అమిత్, గీతా మాధురిని సామ్రాట్ ఒప్పించాలి. గణేష్‌ను స్విమ్మింగ్ పూల్‌లో తోసేయాలి. ఇవన్నీ చేస్తే బహుమతులతోపాటు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులవుతారు అని బిగ్ బాస్ ప్రకటించారు.

అయితే రోల్ రైడా.. గీతా మాధురికి ముద్దు పెట్టడానికి పెద్ద కష్ట పడాల్సిన అవసరం రాలేదు. పెళ్లి సందడిలో సడేమియాలా గీతా మాధురి బుగ్గపై కిస్ ఇచ్చేశాడు. గీత అడిగిమరీ ఒకరి తరువాత ఒకర్ని ముద్దులకు పిలవడం మరో విశేషం. ఇక గణేష్‌ను సైతం స్విమ్మింగ్ ఫూల్‌లో తోసి తన సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేశాడు రోల్ రైడా. 

ఇక సామ్రాట్ ఎవరికీ తెలియకుండా స్వీటు బాక్సులు తిన్నారు. పూజాను పెళ్లికి ఒప్పించే విధంగా కొంత మేరకు సామ్రాట్ సఫలమయ్యాడు. ఇక గురువారం జరిగే ఎపిసోడ్ లో కూడా పెళ్లి వెళ్లి వేడుక కంటిన్యూ అవ్వనుంది.