గీతా మాధురీ, సామ్రాట్‌... చూపులు కలిసిన శుభవేళ

గీతా మాధురీ, సామ్రాట్‌... చూపులు కలిసిన శుభవేళ

బిగ్ బాస్ సీజ‌న్ 2లో ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ కోసం ఇంటి స‌భ్యులు రెండు గ్రూపులుగా విడిపోయిన సంగ‌తి తెలిసిందే. 66వ ఎపిసోడ్‌లో మొద‌లైన టాస్క్ 67వ ఎపిసోడ్‌లోను కంటిన్యూ అయింది. మంగ‌ళ‌వారం రోజు కౌశ‌ల్‌, దీప్తి సున‌య‌న‌ల మ‌ధ్య సీరియ‌స్ డిస్క‌ష‌న్ జ‌రుగుతున్న క్ర‌మంలో సున‌య‌న ఫోన్ ప‌క్క‌న పెట్టి బ‌య‌ట‌కి వెళ్ల‌డంతో బిగ్ బాస్ కౌశ‌ల్‌కి ఒక పాయింట్ ఇచ్చారు.

బిగ్‌బాస్ ఇచ్చిన పనిష్మెంట్ ప్రకారం.. తనీష్, సునయనాలు రాత్రి నిద్రపోకూడదు. అయితే, వారు ఆ రూల్ తప్పి నిద్రించడంతో బిగ్‌బాస్ అర్ధరాత్రి వారిని నిద్రలేపాడు. దీంతో తనీష్ భావోద్వేగానికి గురయ్యాడు. సునయన తనీష్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించింది. 

ఇక టాస్క్‌లో భాగంగా గణేష్‌కు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భగా గణేష్.. తనకు, బాబు గోగినేనికి మధ్య ఉన్న బంధాన్ని కౌశల్ వ్యతిరేకించడాన్ని ఫోన్ కాల్‌లో ప్రస్తావించాడు. చెప్పాలంటే, గణేష్ తన ఒరిజినాలిటీ చూపే ప్రయత్నం చేశాడు. కొంతవరకు కౌశల్‌ను విసిగించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, కాల్ సెంటర్లోని శ్యామలా.. కౌశల్‌ను కూల్ చేయడంతో సహనంతో కాల్ కొనసాగించాడు. ఈ సందర్భంగా గణేష్.. ‘‘ఐ యామ్ నాట్ గెట్టింగ్ మర్యాదా, విడ్డూరం, బొక్కలు’’ అంటూ రెట్టించే ప్రయత్నించినా కౌశల్ అతడికి తగిన సమాధానాలు ఇచ్చాడు. 

ఆ త‌ర్వాత కాల్ సెంట‌ర్ వ్యక్తులు ప‌బ్లిక్ కాల‌ర్స్‌గా మారారు. టాస్క్‌లో భాగంగా మొదటి కాల్ శ్యామలా.. గ‌ణేష్ తో మాట్లాడింది. తెలుగు స‌రిగ్గా మాట్లాడలేక‌పోవ‌డంతో ముందు తెలుగు నేర్చుకోమ‌ని అంది. తనకు తెలుగులో 32 మార్కులు మాత్రమే వచ్చని చెప్పాడు. నువ్వు ఫోన్ పెట్టు ముందు అంటూ గ‌ణేష్‌ని బాగ‌నే విసిగించింది శ్యామ‌ల‌.

కౌశ‌ల్ మొద‌టి కాల్ త‌నీష్‌తో మాట్లాడాడు. ఒక‌వైపు త‌నీష్‌ని విసిగించాల‌ని కౌశ‌ల్ ప్ర‌య‌త్నించ‌గా, త‌నీష్ .. కౌశ‌ల్‌ని చెట్టెక్కించాడు. ఒక్కొక్క‌రిలో పాజిటివ్ విష‌యాలు చెబుతూ వెళ్లాడు త‌నీష్‌.

కౌశ‌ల్‌ని అంద‌రు టార్గెట్ చేస్తున్నార‌ని మీరు అనుకుంటున్నారా లేదా అని కౌశ‌ల్‌.. త‌నీష్‌ని అడిగాడు. అందుకు లేద‌ని చెప్పాడు. మీకు కౌశ‌ల్‌లో ఏమి న‌చ్చ‌లేద‌ని త‌నీష్‌ని అడ‌గ‌గా అత‌నిలో తెలియ‌ని బాస్ ఇజం ఉంటుంది, కొన్ని గ‌ట్టిగా చెబితే అర్దం చేసుకుంటారు అని చెప్పాడు.

ఇలా త‌నీష్‌,కౌశ‌ల్‌లు మాట్లాడుకుంటూ ఉంటున్న స‌మ‌యంలో బిగ్ బాస్ కాల్ సెంట‌ర్ టాస్క్ ఈ రోజుకి పూర్తైంద‌ని మిగతాది రేపు ప్రారంభం అవుతుంద‌ని అన్నారు. అయితే ఇటు త‌నీష్‌, కౌశ‌ల్ క‌ట్ చేయ‌ని కార‌ణంగా త‌నీష్‌, కౌశ‌ల్‌కి ఒక్కో పాయింట్ ఇచ్చారు బిగ్ బాస్.

త‌నీష్‌, సున‌య‌న‌ల‌కి బిగ్ బాస్ విధించిన శిక్ష పూర్తైంద‌ని తెలియ‌జేశారు. గీతా మాధురీ, సామ్రాట్‌ల చూపుల యుద్ధం జరిగింది. ఈ ఎపిసోడ్‌లో గీతా, సామ్రాట్‌తో సరదాగా ఆటలాడుతూ కనిపించింది. సామ్రాట్ కాల్ సెంటర్ సభ్యుడిగా ఉన్నప్పుడు తాను అతడిని అలాగే చూస్తూనే ఉండిపోయానని గీతా అనడం గమనార్హం. అయితే, గీతా ఆ చూపులను టాస్క్‌లోనూ కొనసాగించింది. టాస్క్ సాగుతున్నంత సేపు సామ్రాట్, గీతాలు ఒకరినొకరు చూసుకుంటూనే ఉండిపోయారు. అంతేకాదు, అర్ధరాత్రి వేళ.. వారిద్దరు మాత్రమే మాట్లాడుకున్నారు.