ఇంటి సబ్యులు ఎందుకు ఏడ్చారు

బిగ్ బాస్ సీజన్2.. 60 వ ఎపిసోడ్‌ లో "అంతిమ యుద్ధం" టాస్క్ కొనసాగింది. ఈ టాస్క్‌లో భాగంగా..కబాడీ పోటీలు జరిగాయి. కబాడీ ఆటలో పురుషులే గెలిచారు. 

స్విమ్మింగ్ ఫూల్‌ ఏరియాలో తాళం వేసి ఉన్న బాక్స్‌లను ఉంచి వాటి తాళం చెవులను స్విమ్మింగ్ ఫూల్‌లో ఉంచారు. వాటిని వెతికి పట్టుకుని గట్టుపై ఉన్నవాళ్లకు అందిస్తే.. వాళ్లు దొరికిన తాళం ఏ పెట్టిదో కనుక్కుని దానితో తాళం తీసి అందులో ఉన్న కాయిన్స్‌ను గెలుచుకోవాలనేది టాస్క్. ఈ టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ ఫూల్‌లోకి తాళం చెవుల కోసం పూజ సామ్రాట్ లు పూటి పడ్డారు. అయిన మల్లి అబ్బాయిలదే ఫై చెయ్ అయింది.

ఇక కారు టైర్ మార్చే టాస్క్‌ను మహిళలకు ఇచ్చారు బిగ్ బాస్. ఈ గేమ్‌లోనూ పూజానే హవా కొనసాగించింది. కారు టైర్‌ను జాకీతో ఈజీగా ఊడపీకి శ్యామల, దీప్తిల సాయంతో ఈజీగా కారు టైర్ మార్చేసింది. నలుగురు పురుషులు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు కార్చాలని.. ఈ సమయంలో అందరూ సైలెంట్‌గా ఉండాలనేది నిబంధన. ఈ టాస్క్‌లో భాగంగా కౌశల్, సామ్రాట్, గణేష్, రోల్ రైడాలు తమ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌ను గుర్తు చేసుకుని నిజంగానే ఏడ్చేశారు.

ఇక గోల్డ్ కాయిన్స్ కోసం ఇరు జట్ల మధ్య హోరా హోరీ వాదన నడిచింది. కాని ఎవరు గెలిచారో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.