వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో ఇద్దరు

బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఏదైనా జరగొచ్చు.. అన్నట్లే ఇన్నాళ్ల తరువాత ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 50లో ప్రేక్షకులు, సోషల్ మీడియా అంచనాలకు అందకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆల్ రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఇద్దర్ని తిరిగి బిగ్ బాస్ హౌస్‌కి తీసుకువచ్చారు. 

నాని.. ఈసారి హౌస్ మేట్స్‌ కి కొత్త టాస్క్ ఇచ్చారు. ఈవారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న కౌశల్, నందిని, సునయన, గణేష్, బాబు గోగినేనిలకు రెయిన్ కోట్స్ వేసి.. వాళ్లను ఎలిమినేట్ చేయడానికి గల కారణాలను తెలియజేయాల్సిందిగా హౌస్ మేట్స్‌ను కోరారు. ఈ టాస్క్‌లో భాగంగా ఒక్కొక్కరికి ఐదు వాటర్ బాల్ ఇస్తామని వాటితో మీకు నచ్చని కంటెస్టెంట్ కొట్టి ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారో కారణం చెప్పాలన్నారు. ఇక హౌస్‌లో ఉండాలని ఎవర్ని కోరుకుంటున్నారో వాళ్లని కూడా వాటర్ బాల్‌తో కొట్టి కారణం చెప్పాలన్నారు.

తరువాత ఈవారం ఎలిమినేషన్ లేదంటూ కంటెస్టెంట్స్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన నాని.. మరి ఆ ఓటింగ్ దేనికోసమే సస్పెన్స్ అని ఇంటి సబ్యులతో ముచ్చటించారు.

ఇక ఆదివారం ఉదయం నుంచే నూతన్‌ నాయుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని అధికారికంగా తెలిసిపోయినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే ఇంకో విషయం ఏమిటంటే.. ఆయనతో పాటు యాంకర్‌ శ్యామల సైతం హౌస్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది.  బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఎన్నడూ రాని విధంగా ఓట్లు వచ్చాయని, నూతన్‌ నాయుడు, శ్యామలకు స్వల్ప ఓట్ల తేడా ఉండటంతో బిగ్‌బాస్‌ ఇద్దరికి అవకాశం ఇచ్చినట్లు సమాచారం ముందే లీకైంది. దీంతో ఆదివారం షోలో సస్పెన్స్‌ లేకుండానే ముగిసింది. 

అయితే వీరిద్దరు హౌజ్‌లో ఎప్పటినుంచి పాల్గొనబోతున్నారో బిగ్‌బాస్‌ డిసైడ్‌ చేయనున్నట్లు నాని తెలిపాడు.