ఈ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా సాగాయి

ఈ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా సాగాయి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 93 వ ఎపిసోడ్ లో కౌశల్, దీప్తి మధ్య వాడి వేడి చర్చ జరిగింది. నేను ఇచ్చిన సలహాలను పాటించి ఉంటే బాగుండేది అని కౌశల్ అనగా.. ఇంట్లో పరిస్థితిని అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది అంటూ దీప్తి జవాబిచ్చింది.
అలాగే ఇప్పటి వరకూ కౌశల్‌ని తప్ప మిగిలిన వాళ్లను మనం నామినేట్ చేయలేదు. ఈసారి మనం నామినేట్ చేయాల్సివస్తుంది. ఎవర్ని నామినేట్ చేయాలో డిసైడ్ అవ్వాలంటూ సామ్రాట్‌కి గీతా మాధురి చెప్పింది.
ఇక ఓప్పో సెల్ఫీ గేమ్ జరిగింది. ఓప్పో ఫోన్లను చార్జింగ్ చేసి నాలుగు రకాల ఫోటోలు దిగాలి. అందుకోసం ఇంటిలోని సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోవాలి. ఒక సెల్ఫీలు తీసుకొంటుండగా మరో వర్గం అడ్డుకోవాలి. ఈ గేమ్ ఫిజికల్‌ టాస్క్‌గా చాలా ఆసక్తిగా సాగింది. కౌశల్ గ్రూప్ సభ్యులు విజేతలుగా నిలిచారు.

వారం నామినేషన్ చాలా ఆసక్తికరంగా హాట్ హాట్‌గా సాగాయి. ఒక్కొక్క సభ్యుడు ఇద్దరిద్దరు కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలన్నారు బిగ్ బాస్. ఇందుకోసం తాము ఎలిమినేట్ చేయాలనుకుంటున్న ఇద్దరి ఫోటోలను తీసుకుని ఎదురుగా ఉన్న మంటలో వేసి అందుకు గల కారణాలను వివరించాలన్నారు.

ఎవరు ఎవర్ని నానిమినేట్ చేశారో చూసేద్దాం

రోల్ రైడా - దీప్తి నల్లమోతు, గీతా మాధురి

అమిత్ - దీప్తి నల్లమోతు, గీతా మాధురి

సామ్రాట్ - దీప్తి నల్లమోతు, అమిత్‌

కౌశల్ - తనీష్‌, గీతా మాధురి

గీతా మాధురి - అమిత్, రోల్ రైడా

తనీష్ దీప్తి, అమిత్‌

దీప్తి నల్లమోతు - అమిత్‌, రోల్ రైడా

ఈవారం ఎలిమినేషన్‌లో కౌశల్‌, దీప్తి నల్లమోతు, గీతా మాధురి, అమిత్, రోల్ రైడా ఉన్నారు.