ఈ సారి మధ్యలోనే ఇంటి బాట పట్టిన శ్యామల

ఈ సారి మధ్యలోనే ఇంటి బాట పట్టిన శ్యామల

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 92 వ ఎపిసోడ్ లో సిల్లీ ఫెలోస్అల్లరి నరేష్, సునీల్‌లు సందడి చేశారు. శుక్రవారం నాడు విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వస్తుండటంతో బిగ్ బాస్ హౌస్ నుండి ప్రమోషన్స్ నిర్వహించారు. సినిమా కాన్సెప్ట్‌ను బిగ్ బాస్ హౌస్‌లో ప్రజెంట్ చేసేందుకు నాని ఓ సరదా టాస్క్ ఇచ్చారు. సునీల్ పెద్దన్నగా, నరేష్ తమ్ముడి పాత్రను పోషించారు. వీరిద్దరి నాన్న చనిపోతూ రూ.500 కోట్లు ఒకరిపేరు మీద రాస్తారు. ఆ వ్యక్తి ఎవరు అనే వివాదంపై సభ్యుల చేత అభిప్రాయాలను తీసుకొన్నారు. చివరికి సునీల్, నరేష్‌కు చెరో 250 కోట్లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు.

ఇక ఎలిమినేషన్‌లో భాగంగా ప్రస్తుతం హౌస్‌లో 8 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్‌ ప్రక్రియలో ఉన్నఅమిత్‌ ఎలిమినేట్‌ అవుతారని అంతా భావించారు. కాని వీరిలో ఈ వారం శ్యామల ఎలిమినేట్‌ అయ్యారు.

బిగ్ బాస్ స్టేజ్ కి నవ్వులు చిందుస్తూ వచ్చిన శ్యామల తనకు గీతా మాధురి అంటే చాలా ఇష్టం అంటూ అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది. అలానే తనీష్ తో సెకండ్ ఎంట్రీ తరువాత బాగా క్లోజ్ అయ్యా అన్నారు. ఇక కౌశల్ గురించి మాట్లాడుతూ.. ఆయన రియల్ లైఫ్ సంచాలకుడు అని.. ప్రతిదీ రూల్స్ ప్రకారం ఫాలో అవుతారన్నారు. బిగ్ బాస్ విన్ అయ్యేందుకు టాప్ 3లో గీతా మాధురి, తనీష్, రోల్ రైడా ఉండొచ్చన్నారు. ఆ తర్వాత ఇంటి సభ్యులు గీతా, తనీష్‌తో మాట్లాడింది. ఆ తర్వాత రోల్ రైడాపై బిగ్‌బాంబ్ వేసింది. బిగ్‌బాంబ్ ప్రకారం ప్రతీ ఇంటి సభ్యుడికి సేవకుడిగా ఏ పని చెబితే అది చేయాల్సి ఉంటుంది.