దీప్తి పై తనీష్ దాడి

 దీప్తి పై తనీష్ దాడి

బిగ్ బాస్ సీజన్ 2 90వ ఎపిసోడ్ లో ‘టిక్కెట్ టు ఫినాలే’ టాస్క్ కొనసాగింది. కారులో గీతా మాధురి నిద్రపోవడంతో కుక్కలు మొరిగాయి. దాంతో కౌశల్‌ ఈ పోటీలో గీతా మాధురిని అనర్హురాలిగా ప్రకటించారు. దాంతో గీతా మాధురి ఈ టాస్క్‌ను విడువక తప్పలేదు.

‘టిక్కెట్ టు ఫినాలే’ టాస్క్‌ను ఫిజికల్ టాస్క్‌గా మార్చేశారు తనీష్, సామ్రాట్‌లు. గీతా మాధురి కారులో నుండి దిగిపోవడంతో శ్యామలను సామ్రాట్.. దీప్తిని తనీష్ కారులో నుండి బయటకు తోసేందుకు ఫిజికల్ అటాక్ చేశారు. ఎక్కడ బడితే అక్కడ పట్టుకుని అమ్మాయులు  అని కూడా చూడకుండా.. కారు నుండి బయటకు తోసేందుకు ప్రయత్నించారు. అయితే శ్యామల, దీప్తిలు గట్టిగా ఎదుర్కోవడంతో కారులోనే ఉండిపోయారు.

దీప్తి వెంట్రుకలు కింద నేలను తాకాయి. కావున ఆమె ఈ పోటికి అనర్హురాలు అని తనీష్ చేసిన వాదనను కౌశల్ తోసిపుచ్చాడు. కానీ తనీష్ మొండిగా వాదించడంతో కౌశల్ ఒప్పుకోలేదు. అంతలోనే బిగ్‌బాస్ స్పందిస్తూ కాలు కిందపెడితేనే అనర్హురాలు అవుతారు అని చెప్పడంతో తనీష్ కి తగిన బుద్ధి చెప్పినట్టయింది.

ఇక ఈ గేమ్ చివరిదశకు చేరుకోవడంతో సామ్రాట్ బాత్రూమ్ అర్జంట్ కావడం వల్ల కారు నుండి దిగిపోయారు. అనంతరం బజర్ మోగడంతో అప్పటికి కారులో దీప్తి, శ్యామల, తనీష్‌లు ఉండటంతో గేమ్ రూల్ ప్రకారం ఎవరూ ‘టిక్కెట్ టు ఫినాలే’లో విజేత కాలేకపోయారు.