కౌశల్‌కి అన్యాయం చేసిన గీత

కౌశల్‌కి అన్యాయం చేసిన గీత

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఎపిసోడ్ 89 వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఎలా ఉండొచ్చని ఊహిస్తూ.. ఆయన బొమ్మ వేస్తూ బిగ్ బాస్ ని ఏమనుకుంటున్నారో చెప్పాలంటూ బిగ్ బాస్ టాస్క్ ఇవ్వగా.. బిగ్ బాస్ బొమ్మ వేసి పొగిడారు ఇంటి సబ్యులు. 

చక్కగా ఓ కునుకు తీయడంతో ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు అని కౌశల్ అనగా.. గీతా కోపంతో ఊగిపోయింది. నన్ను ఎందుకు సాధిస్తావు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గీతాకు సామ్రాట్, తనీష్ మద్దతు పలికారు. ఇంటి సభ్యులతో గత 13 వారాలు సాగిన జర్నీని బిగ్ బాస్ చూపించారు.

గార్డెన్ ఏరియాలో ఒక కారు ఉంచి.. ఆ కారులో ముందుగా వెళ్లి కూర్చున ఐదుగురు కంటెస్టెంట్‌ 24 గంటలు పాటు ఆ కారు నుండి కాలు కింద పెట్టకుండా కూర్చోవాలని ఫైనల్‌గా ఆ ఐదుగురిలో ఎవరైతే కిందకి దిగకుండా ఉంటారో వాళ్ళకు టిక్కెట్ టు ఫినాలేలభిస్తుందని.. ఈ టిక్కెట్‌ లభించిన వాళ్లకి ఎలిమినేషన్‌ నుండి మినహాయింపు కల్పిస్తూ.. ఫినాలేకి వెళ్లే అవకాశం కల్పించారు. 

గీతా మాధురి కౌశల్‌ను సీజన్ మొత్తం నామినేట్ చేయడంతో అతడికి ఈ టాస్క్‌లో పాల్గొనడానికి వీలు లేదన్నారు బిగ్ బాస్. అయితే టాస్క్‌కి సంచాలకుడిగా కౌశల్ ఉండాలన్నారు బిగ్ బాస్. 

ఇక  జర్ మోగిన తరువాత రోల్ రైడా, అమిత్‌లను వెనక్కి నెట్టి మిగిలిన ఐదుగురు శ్యామల, దీప్తి, తనీష్, సామ్రట్, గీతా మాధురి, తనీష్‌‌లు కారులో పోటీ పడి ఎక్కేశారు. దీంతో ఈ ఐదుగురి మధ్య టిక్కెట్ టు ఫినాలేజరగనుంది.