ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సి వచ్చిన సామ్రాట్

ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సి వచ్చిన సామ్రాట్

బిగ్ బాస్ సీజన్ 2 88 వ ఎపిసోడ్ లో టాలీవుడ్ మారథాన్టాస్క్ కొనసాగించారు. సాంగ్స్‌ రిపీట్‌గా ప్లే అవ్వడంతో అలసిపోయిన కంటెస్టెంట్స్.. అర్ధరాత్రి నిద్రలో ఉన్నా.. మళ్లీ సాంగ్ ప్లే అవగానే.. పరుగెత్తుకెళ్లి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. 

ఇక గీతా మాధురికి బిగ్‌బాస్ టార్చర్ పెట్టాడు. బాత్రూం వద్దకు వెళ్లగానే జిగేల్ రాణి పాట వేసి పరుగులు పెట్టించాడు. బాత్రూం వద్ద నుంచి పరుగులు పెట్టి డ్యాన్స్ ఫ్లోర్ వద్దకు చేరుకోగానే పాటను ఆపేయడం, ఆ తర్వాత గీతా మాధురి బాత్రూం వద్దకు చేరగానే మళ్లీ పాట వేయడం జరిగింది.

ఇక సామ్రాట్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి కోర్టు పనిమీద బయటకు వెళ్లి రావాల్సినందున మీమ్మల్ని ఇంటి నుంచి పంపిస్తున్నాం అని చెప్పారు బిగ్ బాస్.

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా మధ్యలో మరో రెండు టాస్క్‌లను కూడా బిగ్‌బాస్ ఇచ్చాడు. అందులో ఒకటి కేక్‌ తినడం, రెండోది సినిమాకు సంబంధించిన ఓ పదాన్ని ఇచ్చి దానిని బోర్డుపై ఓ సభ్యుడు బోమ్మ గిస్తే మరో సభ్యుడు దాని అర్థం చెప్పాలి అని చెప్పారు.

ఇక రెండో రోజు కూడా వీళ్ళ డాన్సులు చూడలేక వీక్షకులకు విసుగు పుట్టించారు బిగ్ బాస్.