డాన్స్ తో వీక్షకుల సహనానికి పరీక్ష పెట్టెన ఇంటి సబ్యులు

డాన్స్ తో వీక్షకుల సహనానికి పరీక్ష పెట్టెన ఇంటి సబ్యులు

బిగ్ బాస్ సీజన్ 2  87 వ ఎపిసోడ్ లో ‘టాలీవుడ్ మారథాన్’ టాస్క్‌ని విజయవంతంగా పూర్తి చేస్తే లగ్జరీ బడ్జెట్ వస్తుందని చెప్పారు. దానికనుగుణంగా ఇంటిని సినిమా హాలు మాదిరిగా పోస్టర్లతో నింపేశాడు. డ్యాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేశాడు. దానిపై డ్యాన్స్ చేయడానికి ఒక్కొక్కరికి ఓ పాటను కేటాయించాడు. సభ్యుడు ఏ పనిలో ఉన్నా.. అతనికి కేటాయించిన పాట ప్లే అయితే వెంటనే వచ్చి డ్యాన్స్‌ చేయాలని.. ఒకవేళ తనకి కేటాయించిన పాటని ఇంటి సభ్యుడు మర్చిపోయినా.. లేదా డ్యాన్స్ చేయకపోయినా.. లగ్జరీ బడ్జెట్ రాదని హెచ్చరించాడు. 

ఇక ఎవరెవరికి బిగ్ బాస్ ఏ పాట ఇచ్చారో చూద్దాం. గీతా మాధూరి జిగేల్ రాణి, కౌశల్ తౌబా తౌబా, తనీష్ సరైనోడు, రోల్ రైడా నైరే నైరే నైనైరే బాబా, శ్యామల జంక్షన్ జంక్షన్‌లో, దీప్తి నల్లమోతు అ అంటే అమలాపురం, అమిత్‌కు ట్రింగ్ ట్రింగ్, సామ్రాట్ సీటీ మార్, పాటలను కేటాయించారు. గ్రూప్‌గా ఖైదీ నంబర్ 150, పురుషులకు  అదరగొట్టు...అదరగొట్టు, మహిళలకు కెవ్వు కేక పాటలకు డ్యాన్స్‌లు చేయాలని చెప్పారు.

దీంతో.. కంటెస్టెంట్స్‌ అందరూ తొలుత చాలా ఉత్సాహంగా పాటలకి డ్యాన్స్ చేశారు. కానీ.. ఒక్కొక్క సాంగ్ రిపీట్‌గా ప్లే అవ్వడంతో చివరికి డ్యాన్స్ చేయలేక నీరసించి పోయారు. 

అర్ధరాత్రి నిద్రలో ఉండగా కూడా పాటలను ప్లే చేసి సెలబ్రీటలతో బిగ్‌బాస్ ఆడుకొన్నాడు. నిద్ర మత్తులోనే ఇంటి సభ్యులు డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వచ్చి డ్యాన్స్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఈ టాస్క్‌ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.