గీతని ప్రేమిస్తున్నానని చెప్పిన కౌశల్

గీతని ప్రేమిస్తున్నానని చెప్పిన కౌశల్

బిగ్‌బాస్‌ సీజన్ 2 86వ ఎపిసోడ్ లో లవ్, హేట్ అనే ఆటను ఇంటి సభ్యులతో బిగ్‌బాస్ ఆఢించారు. అలాగే నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. 

ఇక లవ్, హేట్ ఆటలో ఎవరు ఎవరెవరిని ప్రేమించారో ద్వేషించారో చూద్దాం...

గీతా మాధురి ప్రేమించేది దీప్తి, ద్వేషించేది సామ్రాట్ 

కౌశల్ ప్రేమించేది గీత  ద్వేషించేది కూడా గీత అని చెప్పారు 

అమిత్  ప్రేమించేది రోల్ రైడా, ద్వేషించేది కౌశల్ 

తనీష్  ప్రేమించేది సామ్రాట్, ద్వేషించేది కౌశల్ 

శ్యామల  ప్రేమించేది గీతా మాధురి, ద్వేషించే వ్యక్తి తనీష్ 

దీప్తి నల్లమోతు  ప్రేమించేది గీతా మాధురి, ద్వేషించేది సామ్రాట్ 

సామ్రాట్  ప్రేమించేది తనీష్, ద్వేషించేది గీతా మాధురి 

రోల్ రైడా  ప్రేమించేది అమిత్, ద్వేషించేది తనీష్

ఇక నామినేషన్స్ ప్రక్రియలో ఇంటి సభ్యుల ముగ్గురి ఫోటోలను ఇంటి బయట ఉంచిన బోర్డ్‌పై ఉంచి నామినేట్ చేసి, ఒకరిని సేవ్ చేయమని బిగ్‌బాస్ కోరాడు. ఆ తర్వాత సేవ్ ఓట్లు ఎక్కువగా రావడంతో సమ్రాట్ ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకొన్నాడు.

మర్డర్ టాస్క్‌లో భాగంగా.. కౌశల్ ఈ సీజన్ మొత్తం ఎలిమినేట్ కావడంతో అతన్ని ఈవారం నామినేట్ చేయకుండానే ఎలిమినేషన్‌లో ఉంటారని.. అలానే గీతా మాధురికి మినహాయింపు ఉండటం వల్ల ఆమె కూడా ఎలిమినేషన్ ఉండదన్నారు బిగ్ బాస్.

ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో కౌశల్‌తో పాటు  అమిత్, శ్యామల, దీప్తిలు ఉన్నారు. ఇక ఈ వారం ఈ నలుగురిలో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు.