ఈ వారం బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయిన సామాన్యులు...

ఈ వారం బిగ్‌బాస్‌లో ఎలిమినేట్ అయిన సామాన్యులు...

బిగ్ బాస్ సీజన్ 2 85 వ ఎపిసోడ్ లో శనివారం ఎలిమినేట్ అయిన గణేష్ ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చి బిగ్ బాస్ జర్నీ ఎలా ఉందో ప్రేక్షకులతో పంచుకున్నారు. బిగ్ బాస్ నాకు లైఫ్ నేర్పింది అని అన్నాడు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో ఇద్దరితో మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వగా దీప్తి, గీత మధురి తో మాట్లాడాడు. ఇక కౌశల్ ఫై  బిగ్‌బాంబ్ వేశాడు. బిగ్‌బాంబ్ ప్రకారం కౌశల్ ప్రతీ రోజు నేలపైనే పడుకోవాలి.

ఇక వారం అంతా రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ హౌస్ ఆదివారం నాడు నాని ఎంట్రీతో సరదాగ సాగింది. కౌశల్ కళ్లకు గంతలు కట్టి రోల్ రైడాకు మహిళలకు వేసే వేషాన్ని వేయించారు. ఆ ప్రక్రియ చాలా సరదాగా సాగింది. అమిత్-శ్యామల కళ్లకు గంతలు కట్టుకొని ఐస్ క్రీమ్ తినిపించుకొనే గేమ్ ఆడారు. ఇలా ఇంటి సబ్యులు అందరు సరదా సరదాగా టాస్క్ లు ఆడారు. 

ఇక ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.  అమిత్, సామ్రాట్, నూతన్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. తొలుత సమ్రాట్‌ను ప్రొటెక్టెడ్ జోన్లోకి నాని పంపించండంతో అమిత్, నూతన్ మిగిలారు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు నూతన్ నాయుడు. బిగ్‌బాస్ వేదికపై నూతన్ మాట్లాడుతూ బిగ్‌బాస్‌లో నా జర్నీ యూనిక్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు అని చెప్పారు నూతన్ నాయుడు. 

ఇక బిగ్ బాంబ్‌లో భాగంగా ఈవారం అంతా హౌస్‌లో అందరి ప్లేట్లు కడగాలని.. ఈ బిగ్ బాంబ్ ఎవరిపై విసురుతున్నారని నాని అడగటంతో... హౌస్‌లో నాకు ఉన్నది ఇద్దరే స్నేహితులు ఒకరు కౌశల్, ఇంకొకరు దీప్తి అన్నారు. అయితే కౌశల్‌పై బిగ్ బాంబ్ వేయలేనంటూ దీప్తిపై బిగ్ బాంబ్ విసిరారు.