మరో సారి కౌశల్ ని ఒంటరి చేసిన ఇంటి సబ్యులు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఎపిసోడ్ 83 వ ఎపిసోడ్ లో ఈవారం కెప్టెన్ టాస్క్‌లో భాగంగా ‘అలిసిపోతే అంతమే’ సైకిల్ టాస్క్ తనీష్, రోల్ రైడా, నూతన్ నాయుడుల మధ్య హోరా హోరీగా సాగింది. ఎప్పటిలాగే.. నూతన్ నాయుడుకి కౌశల్‌ మాత్రమే మద్దతు దారుడిగా నిలబడగా.. మిగిలిన కంటెస్టెంట్స్ తనీష్, రోల్ రైడాలకు మద్దతు ప్రకటించారు. 

నూతన్ తొక్కుతున్న సైకిల్ పదే పదే పడిపోయింది. దాంతో నూతన్ మధ్యలో ఆపాల్సి వచ్చింది. అది చూసి చిరాకు పడిన తనీష్ పోటీ నుంచి తప్పుకొన్నాడు. రోల్ రైడా ఇప్పటికే కెప్టెన్సీ చేసినందుకు తను ఓ అవకాశం ఇవ్వాలని నూతన్ చేసిన రిక్వెస్ట్‌ను గీతా గ్రూప్ నిరాకరించింది. టాస్క్ ఎండ్ బజర్ మోగే సమయానికి ఇద్దరూ సైకిల్ మీదే ఉంటే.. ఇద్దర్లో ఏ ఒక్కరూ కెప్టెన్ కాలేరని బిగ్ బాస్ ఆదేశించారు. కెప్టెన్ టాస్క్‌ లో నూతన్ నాయుడు, రోల్ రైడాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎండ్ బజర్ మోగే సమయానికి ఇద్దరూ సైకిల్ మీదే ఉండటంతో ఈ వారానికి బిగ్ బాస్ హౌస్‌కి ఎవరూ కెప్టెన్‌ కాలేరన్నారు బిగ్ బాస్. 

ఇక హెయిర్ టానిక్ బ్యూటీ కాంటెస్ట్‌లో శ్యామల, దీప్తి, గీతా మాధురి పాల్గొన్నారు. శ్యామలకు రోల్, తనీష్, దీప్తికి నూతన్, గణేష్, గీతాకు సమ్రాట్, అమిత్ అలంకరించారు. కౌశల్ సంచాలకులుగా వ్యవహరించారు. ఈ పోటీలో శ్యామల బ్యూటిగా గెలిచింది.

ఇక నెక్స్ట్ ఎపిసోడ్ వీకెండ్ కావడంతో ఈ వారం నామినేషన్స్ లో అందరు టాప్ కంటెస్టెంట్స్ ఉండడం తో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తి గా మారింది.