గీత లవ్ ప్రపోజల్ కి నో చెప్పిన కౌశల్

గీత లవ్ ప్రపోజల్ కి నో చెప్పిన కౌశల్

బిగ్ బాస్ సీజన్ 2 ఎపిసోడ్ 75 పెళ్లి వేడుక టాస్క్ ముగింపుకు వచ్చింది. గత రెండు రోజులుగా సాగిన పెళ్లి టాస్క్ విజయవంతంగా ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించారు. ఇంటి సభ్యులంతా చక్కగా తమ పాత్రలను పోషించారని ప్రతీ ఒక్కరిని అభినందించారు. సీక్రెట్ టాస్క్ చేసిన సామ్రాట్, రోల్ రైడాలను ప్రత్యేకంగా అభినందించారు.

సీక్రెట్ టాస్క్‌లో గెలిచిన సామ్రాట్, రోల్ రైడాలకు ఇంటి నుంచి వచ్చిన ప్రత్యేకమైన బహుమతులను బిగ్‌బాస్ అందజేశారు. వాటిని చూసి ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. ఇంటి సభ్యుల ఫోటోలను చూసి ఉద్వేగానికి, సంతోషానికి లోనయ్యారు.

ఇక ఈవారం బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సబ్యుల ఆసక్తి ఎక్కువ అయింది. కౌశల్, దీప్తి నల్లమోతులు, యాంకర్ శ్యామల, అమిత్‌ మేము కెప్టెన్ పోటీ చేస్తాం అని ముందుకు వచ్చారు.

లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లో రెండు టీంల మధ్య ఫిజిల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. తనీష్, అమిత్, పూజా, గణేష్, సామ్రాట్‌లు ఒక టీంగా ఉండగా.. మిగిలిన కౌశల్, దీప్తి, గీతా మాధురి, శ్యామలలు మరో టీంగా ఉన్నారు. ఈ టాస్క్ మొత్తానికి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్‌గా ఉన్న రోల్ రైడా సంచాలకులకుగా ఉన్నారు. ఇక ఈ ఫజిల్ టాస్క్‌లో తనీష్ టీం విజేతగా నిలిచింది.

అంతలోనే ఇంటిలోకి తాప్సీ, ఆది పినిశెట్టి, రితిక సింగ్ ప్రవేశించారు. యాక్టివిటీ రూంలో ఏర్పాటు చేసిన బిగ్‌బాస్ రేడియో సెంటర్ నుంచి ఇంటి సభ్యులను పలకరించారు. పూజాకు సామ్రాట్ లవ్ ప్రపోజల్ చేయడం, తాప్సీకి తనీష్ ప్రపోజ్ చేయడం, అమిత్, దీప్తి, గణేష్ స్కిట్ చేయడం, బిగ్‌బాస్‌గా కౌశల్ వ్యవహరించగా అతడిని గీతా మాధురి ఆట పట్టించే టాస్కులు ఎంజాయ్‌గా జరిగాయి.

మరి ఈవారం కెప్టెన్ టాస్క్ ఏంటి? కెప్టెన్ అయ్యేది ఎవరో చూడాలి.