బిగ్ బాస్ పెళ్లివేడుకలో ‘రంగమ్మత్త’

బిగ్ బాస్ పెళ్లివేడుకలో ‘రంగమ్మత్త’

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ఎపిసోడ్ 73 పెళ్లి వేడుకతో మొదలైనది. రెండు రోజుల పాటు జరిగే ఈ పెళ్లి వేడుకలో మెహిందీ, పెళ్లి, సంగీత్ ఇలా బిగ్‌బాస్ ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. ఇంటి సభ్యులు రెండు కుటుంబాలుగా మారి గీతా మాధురి, అమిత్ రాధా, కృష్ణ కుటుంబంగా, మాధవీలత కుటుంబంగా కౌశల్, దీప్తి నల్లమోతు జట్టుగా విడిపోయారు. ఈ రాధాక్రిష్ణ, మధులతల బొమ్మల పెళ్లి వేడుకకు పంతులుగా గణేష్ వ్యవహరించారు.

తొలిత స్మిమ్మింగ్ ఫూల్‌లో ఉంచిన ఉంగరాలను వెతికిపట్టుకునే టాస్క్ ఇవ్వగా.. దీప్తి నల్లమోతు, సామ్రాట్‌లు స్మిమ్మింగ్ ఫూల్‌లో తలపడ్డారు. ఇక హౌస్‌లో దాచి ఉంచిన చెప్పుల జతలను వెతికి పట్టుకునేందుకు పెళ్లికూతురు తరుపున అమిత్, గీతా మాధురి, తనీష్, గణేష్, పూజాలు కష్టపడి 20 జతల చెప్పులకు పట్టుకున్నారు. బహుమతులు గెలుచుకునేందుకు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు లడ్డూలను చేయడం, పెళ్లి కుమారులకు దుపట్టాలను అలంకరించడం లాంటి సరదా టాస్క్‌లను ఇచ్చారు బిగ్ బాస్. ఈ సరదా సరదా టాస్క్‌లు జరుగుతుండగానే వివాహ వేడుకకు పెళ్లి పెద్దగా ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ యాంకర్ అనసూయ.

అనసూయను చూడగానే ఇంటి సభ్యులందరూ సంతోషం తో ఆహ్వానించారు. ఇక ఈ రోజు సంగీత్ లో  అనసూయ తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో, అందచందాలతో ఆకట్టుకొనుంది.