లేడీస్ బాత్రూంలు వాడుతున్నాడు అంటూ కౌశల్‌ పై పూజ కంప్లైంట్

లేడీస్ బాత్రూంలు వాడుతున్నాడు అంటూ కౌశల్‌ పై పూజ కంప్లైంట్

బిగ్ బాస్ సీజన్ 2 61 వ ఎపిసోడ్ లో అంతిమ యుద్ధం’ టాస్క్ ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ ఎపిసోడ్ లో అమ్మాయిలకు క్విజ్ పోటిలు పెట్టారు బిగ్ బాస్. ఈ పోటిలో దీప్తిసునయనశ్యామలలు పాల్గొన్నారు. అయితే ఈ ముగ్గురిలో దీప్తి ఒక్కరే చురుగ్గా  చెప్పగలిగారు. శ్యామల రెండు మూడు ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగా.. సునయన మాత్రం ఒక్క ప్రశ్నకు కూడా ఆన్సర్ చేయలేకపోయింది.

ఇక ఎప్పుడూ అమ్మాయులు చేసే వంటలను అబ్బాయులు చేసి.. అమ్మాయుల మెప్పు పొందాలని బిగ్ బాస్ వంట టాస్క్’ ఇచ్చారు. అమిత్తనీష్రోల్ రైడాలు వంటలను చేసి బిగ్ బాస్ నిర్దేశించిన సమయంలో పూర్తి చేయడంతో అబ్బాయులే ఈ టాస్క్‌లో పైచేయి సాధించారు.

కౌశల్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది పూజా. హౌస్‌లో ఇన్ని బాత్ రూంలు ఉన్నా కౌశల్ మాత్రం మహిళల బాత్ రూంలే వాడుతున్నాడంటూ గీతా మాధురికి కంప్లైంట్ చేసింది పూజా. దీనిపై రియాక్ట్ అయిన గీతా మాధురి ఈ విషయంలో నవ్వాలో ఏడవాలో తెలియడం లేదంటూ గతంలో తేజస్విని కూడా ఇదే కంప్లైంట్‌ చేసిందని.. ఇది తొలిసారి కాదంటూ కౌశల్‌పై అడిగే ప్రయత్నం చేసింది గీతా మాధురి. అయితే కౌశల్ నుండి సరైన స్పందన లబించలేదు.

ఇక అంతిమ యుద్ధం’ టాస్క్ లో మహిళలు 325 కాయిన్స్ సాధించగా.. పురుషులు 330 కాయిన్స్‌తో విజేతలుగా నిలిచారు.

ఈ అంతిమ యుద్ధంటాస్క్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన కంటెస్టెంట్స్‌ ఈ వారం కెప్టెన్ అయ్యే అవకాశం ఉండటంతో కెప్టెన్ నామినేషన్ కోసం ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన మహిళఉత్తమ ప్రదర్శన ఇచ్చిన పురుషుడ్ని చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించగా.. పురుషులందరూ తనీష్‌కి పట్టం కట్టారు. ఇక మహిళల టీం తరుపున ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన మహిళగా దీప్తి నిలిచింది. 

అంతిమ యుద్ధం’ టాస్క్‌లో ప్రతిభ చూపిన దీప్తితనీష్‌లకు రంగు రబ్బా.. రబ్బా’ అనే రఫ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌ కోసం సంచాలకులను ఇంటి సభ్యులే ఎన్నుకోవాలి. అతడిదే తుది నిర్ణయం అంటూ బిగ్ బాస్ నియమం పెట్టడంతో సంచాలకులు ఎవరు ఉంటే బావుంటుందాఅని చర్చలు జరుగుతున్న సందర్భంలో నేను ఉంటా చేతులు ఎత్తి సంచాలకులుగా మారింది దీప్తి సునయన. 

ఇక కెప్టెన్ పోరులో రంగు రబ్బా.. రబ్బా’ అంటూ గోడకు పెయింట్ వేయడంలో పోటీపడుతున్నారు దీప్తితనీష్‌లు. మరి ఈ టాస్క్‌లో విజేతగా నిలిచి ఈవారం బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యేది ఎవరో రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

సంచలకురాలిగా సునైన ఉండడంతో ప్రేమ పూజారి తనిష్ నె కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉంది.