గీత, కౌశల్ ను హౌస్ నుండి బయటకు పంపిస్తా – బాబు

బిగ్ బాస్ సీజన్ 2 47వ ఎపిసోడ్‌లో కొత్త కెప్టెన్ ఎంపిక కారణంగా బిగ్ బాస్ హౌస్‌‌కి పాన్ షాప్‌ను రప్పించారు బిగ్ బాస్. ఈ పాన్ షాప్ యజమానురాలిగా పూజా రామచంద్రన్‌ను నియమించారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం పాన్ షాప్ యజమానురాలుగా ఉన్న పూజాను మెప్పించాలని, అలా మెప్పించిన వారిలో ఇద్దరు అబ్బాయిలను, ఇద్దరు అమ్మాయిలను పూజా ఎంపిక చేస్తుందన్నారు బిగ్ బాస్. దీంతో పూజాను మెప్పించడం కోసం కంటెస్టెంట్స్ పోటీ పడ్డారు. వారిలో దీప్తి నల్లమోతు, గీతా మాధురి, సామ్రాట్, అమిత్‌లను ఎంపిక చేసింది పూజా. 

పూజా ఎంపిక చేసిన నలుగురిలో ఒకర్ని ఈ వారం కెప్టెన్‌గా ఎంపిక అయ్యేందుకు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం ఒంటికి పెయింట్ వేసుకుని స్టూల్‌పై కదల కుండా నిలబడాలని ఎవరైతే కదలకుండా కిందకు దిగకుండా చివరి వరకూ ఎవరు నిలబడతారో వాళ్లే ఈ వారం కెప్టెన్ అంటూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ఈ టాస్క్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్లను స్టూల్ పై నుండి దించడానికి ఏమైనా చేయొచ్చని చెప్పారు బిగ్ బాస్.

కెప్టెన్ ఎంపికలో భాగంగా తనీష్, సామ్రాట్‌ల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టూల్‌పై నిలబడ్డ సామ్రాట్‌ను కిందికి దించే ప్రయత్న చేస్తున్న కౌశల్‌ను తనీష్ అడ్డుకున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ తనీష్, నందిని వాదించారు. గతంలో నేను కెప్టెన్‌ టాస్క్‌లో పాల్గొన్నప్పుడు నా ముఖంపై పసుపు కొట్టారని.. ఇప్పుడు నేను వాటర్ పోస్తే తప్పటున్నారని కౌశల్ కౌంటర్ ఇచ్చారు.

ఇక గీతా మధురి రెండో సారి హౌస్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యారు. కెప్టెన్ కోసం పోటీ పడుతున్న పోటీ దారుల్లో అమిత్ ముందే డ్రాప్ అవ్వగా.. సామ్రాట్, దీప్తి, గీతా మాధురిలు మిగిలారు. అయితే దీప్తిని స్టూల్ నుండి కిందికి దింపే క్రమంలో బాబు గోగినేని ఆమెపై బకెట్‌తో వాటర్ కొట్టారు. ఆ క్రమంలో బకెట్ ఆమెకు తాకడంతో కిందకు పడింది దీప్తి. ఈ విషయాన్ని గ్రహించిన కౌశల్.. బకెట్ ఆమెకు తగలడం వల్లే ఆమె కిందికి దిగిందంటూ సామ్రాట్‌ను బలవంతంగా కిందికి తోసేశాడు. దీంతో గీతా మాధురి ఒక్కరే ఫైనల్ వరకూ నిలవడంతో ఆమె ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యారు. 

ఇక ఈ వారం కొత్త కెప్టెన్‌గా ఎంపికైన గీతా మాధురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు గోగినేని. తాను బకెట్‌తో వాటర్ మాత్రమే పోశానని, బకెట్ టచ్ కాలేదంటూ వాదించారు బాబు. దీంతో గీతా మాధురి కల్పించుకోవడంతో ఆగ్రహంతో ఆమెపై వాదనకు దిగారు బాబు.

దీనికి గీతా మాధురి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. నేను మీకు నచ్చకపోతే నామినేట్ చేయండి. నానికి కంప్లైంట్ చేసుకోండి? లేదంటే ఏమైనా చేసుకోండి? నా ఇష్టం వచ్చినట్టు ఉంటా మీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదంటూ గట్టి కౌంటర్ ఇవ్వడంతో.. నేను బిగ్ బాస్ హౌస్‌ నుండి వచ్చే శనివారం వెళ్లిపోయినా పర్లేదు కాని.. ఖచ్చితంగా గీతా మాధురి, కౌశల్‌ను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపిస్తా అంటూ శపథం చేశారు బాబు గోగినేని.