బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రొడక్షన్ నెంబర్ 17 చిత్రం ప్రారంభం!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రొడక్షన్ నెంబర్ 17 చిత్రం ప్రారంభం!
నటీనటులుబెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, సోను సూద్, అభిమన్యు సింగ్
డైరెక్టర్ : తేజ
ప్రజెంట్స్ : ఏటివి
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
బ్యానర్ : ఏకే. ఎంటర్టైన్మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కృష్ణ కిషోర్ గరికపాటి
కో.ప్రొడ్యూసర్స్ : అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.
రచయిత : లక్ష్మీ భూపాల్
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
కెమెరామెన్ : శీర్ష రే
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో నానకరామ్ గూడ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. పూజా కార్యక్రమంలో డైరెక్టర్ వి.వి.వినాయక్, డైరెక్టర్ శ్రీవాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలి షాట్ కు డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్ తేజ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. మాజీ మంత్రి దానం నాగేంద్ర చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం  అయ్యింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, అభిమన్యు సింగ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఏకే.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ తేజ, కాజల్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. అలాగే హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ రెండోసారి కిలిసి నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మి భూపాల్ మాటలు రాస్తుండగా శీర్ష రే సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.