బిగ్ బాస్ హౌస్ లో బాబు కథ ముగిసింది...

బిగ్‌బాస్ సీజన్ 2ఆదివారం షో ఆద్యంతం వినోదభరితంగా జరిగింది. హౌజ్‌ మేట్స్‌ను  రెండు గ్రూపులుగా విడగొట్టిన నాని.. వారితో సరదాగా ఆట ఆడించాడు. మధ్యలో నాని కూడా వాళ్లతో కలిసి ఆడాడు. వారి ముందు ఓ రెండు చీటిల డబ్బాను పెట్టారు. ఒక గ్రూపులోని సభ్యుడి వచ్చి దాంట్లోంచి ఒక్కో డబ్బాల్లోంచి ఒక్కో చీటి తీసి అందులో ఉన్న దాన్ని.. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుపై  బొమ్మను గీసి వారి మిగతా సభ్యులతో ఆ చీటిలో వచ్చిందేమిటో చెప్పించాలి. ఇక ఆట పేరు బొమ్మను గీస్తే.. అంటూ నాని ఆటను మొదలుపెట్టారు. 

ఈ ఆటలో హౌజ్‌మేట్స్‌ తమ చిత్రకళను ప్రదర్శించారు. ఒక్కొక్కరు సంబంధం లేని చిత్రాలను గీసి ప్రేక్షకులను నవ్వించారు. వారికి వచ్చిన సామెతలకు, సినిమా పేర్లకు వారు గీసిన బొమ్మలకు పొంతన లేకపోయినా.. మిగతా సభ్యులు అతి కష్టం మీద వాటిని గుర్తించారు. ఈ క్రమంలో హౌజ్‌ అంతా నవ్వులు పూశాయి. 

ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తేశనివారం ఎపిసోడ్‌లో గీతా, శ్యామల సురక్షితులైనట్లు హోస్ట్ నాని ప్రకటించాడు. ఇక మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్‌లో తనీశ్ రెండు రోజుల క్రితమే హౌస్ కెప్టెన్‌గా ఎంపికవడంతో అతను ఆటోమేటిక్‌గా సేవ్‌ అవుతాడు. దీంతో.. ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

గత రెండు వారాలుగా హౌస్‌లో కౌశల్‌తో గొడవలు పడుతూ వస్తున్న బాబు గోగినేని ఈ వారం కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనని కనబర్చలేకపోయాడు.

బిగ్‌బాస్‌ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు వచ్చేశాడు.