fingoshop
fingoshop

"అవెంజర్స్‌- ఇన్ఫినిటీవార్‌" మూవీ రివ్యూ

చిత్రం : అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌

నటీనటులు : రాబర్ట్‌ డౌనీ జూనియర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌, మార్క్‌ రఫెలో, క్రిస్‌ ఎవాన్స్‌, స్కార్లెట్‌ జొహాన్సన్‌, టామ్‌ హొలాండ్‌, విన్‌ డీసిల్‌, క్రిస్‌ ప్రాట్‌ తదితరులు

సంగీతం : అలెన్‌ సిల్వస్ట్రీ

దర్శకత్వ౦ : ఆంథోని రుస్సో, జియో రుస్సో

సినిమాటోగ్రఫీ : ట్రెంట్‌ ఆప్లాచ్‌

ఎడిటింగ్‌ : జెఫ్రీ ఫోర్డ్‌, మాథ్యూస్‌

నిర్మాత : కెవిన్‌ ఫిజీ

బ్యానర్‌ : మార్వెల్‌ స్టూడియోస్‌

విడుదల తేదీ : 27-04-2018

సూపర్‌ హీరోల చిత్రాలకు హాలీవుడ్‌లో కొదవలేదు. ముఖ్య౦గా ‘స్పైడర్‌మ్యాన్‌’, ‘సూపర్‌మ్యాన్‌’, నుంచి నిన్న మొన్నటి ‘బ్లాక్‌ పాంథర్‌’ వరకూ అందరూ బాక్సాఫీస్‌ను కళకళలాడించిన వాళ్లే.. ఈ వేసవిలో వినోదాల విందును పంచడానికి మార్వెల్‌ తీసుకొచ్చిన సరికొత్త యాక్షన్‌, సూపర్‌ హీరోస్‌ చిత్రం ‘అవెంజర్స్‌ ఇన్ఫినిటీవార్‌’. ఈ చిత్రం ఎలా ఉంది? గత చిత్రాలకు దీటుగా అభిమానులను అలరించిందా?

కథ :  టైటాన్‌కు చెందిన భారీకాయుడు థానోస్‌. తనంత గొప్ప వ్యక్తి ఈ విశ్వలో లేడని, మిగిలిన వాళ్లంతా తినడానికి తప్ప దేనికీ పనికిరారని అతడి అభిప్రాయం. అందుకే ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలని భావిస్తాడు. అలా చేయాలంటే అత్యత శక్తివంతమైన ఆరు ఇన్ఫినిటీ స్టోన్స్‌ను సంపాదించాలి. అవి అక్కడక్కడా ఉంటాయి. వాటిని సాధించే ప్రయత్న మొదలు పెడతాడు. ఆ క్రమంలో గార్డియన్స్‌.. ఇతర సూపర్‌హీరోలు థానోస్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తుంటారు. మరి థానోస్‌ చివరకు శక్తివంతమైన రాళ్లను సొంతం చేసుకున్నాడా? అతడి ప్రయత్నాలను సూపర్‌హీరోలు ఏవిధంగా అడ్డుకున్నారన్నదే ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీవార్‌’.

విశ్లేషణ : ఒక విలన్‌.. అతను ప్రపంచాన్ని నాశనం చేయాలనుకోవడం. అతడి చర్యలను సూపర్‌హీరోలు అడ్డుకోవడం. మార్వెల్‌ విడుదల చేసిన గత చిత్రాలన్నీ దాదాపు ఇదే ప్లాట్‌తో కొనసాగుతాయి. ‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌వార్‌’లో సూపర్‌ హీరోలు రెండు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పోరాడటం మనం చూశాం. ఇప్పుడు వారంతా ప్రపంచాన్ని అంతం చేయాలనుకున్న థానోస్‌పై ఎలా పోరాడారన్నదానిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నాడు దర్శకుడు. అందుకు అనుగుణంగా సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లాడు. అయితే, థానోస్‌పై పోరాడే విషయంలో వాళ్లు బృందాలుగానే పోరాడుతారు.


ప్లస్ పాయింట్స్ద్వితీయార్ధం

                         అక్కడక్కడా నవ్వులు

                         పంచ్‌లు


మైనస్ పాయింట్స్ప్రథమార్ధం




 

మరిన్ని కథనాలు

పోస్ట్...
చిత్రం శీను ప్రధాన...
మహేష్‌తో సుకుమార్...
అలా అంటే నాకు...
విలన్‌గా రాజశేఖర్
fingoshop