'అంతరిక్షం' మూవీ ట్రైలర్

'అంతరిక్షం'  మూవీ  ట్రైలర్

వరుణ్‌తేజ్, అదితీరావ్, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా ఘాజీఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం అంతరిక్షం’. అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. డిసెంబర్‌ 21న రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. మిరా అనే శాటిలైట్‌ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్‌ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్‌ దేవ్‌ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది.

తెలుగులో తొలి స్పేస్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు  వరుణ్ తేజ్‌ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్‌ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్‌ వేశారు. వరుణ్‌ సరసన అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్‌ రెడ్డి, క్రిష్‌(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు.