‘సాహో’లో బాలీవుడ్ నటి !

‘సాహో’లో బాలీవుడ్ నటి !

ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం రోజుకో విశేషాన్ని సంతరించుకుంటోంది. సుమారు రూ.200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఇంటర్నేషన్ టెక్నీషియన్స్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుల్ని కూడా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎక్కువ మంది బాలీవుడ్‌ నటులే ఉన్నారు. ప్రతినాయకుడిగా నీల్‌నితిన్‌ ముఖేశ్ నటిస్తుండగా... జాకీ ష్రాఫ్, మందిరా బేడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇప్పుడు సినిమాలో మరో బాలీవుడ్‌ భామ‌ ఎవ్లిన్‌ శర్మ వచ్చారు. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని హిందీలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి, విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.