అమర్ అక్బర్ ఆంటోనీ మూవీ రివ్యూ

టైటిల్ : అమర్ అక్బర్ ఆంటోనీ

తారాగణంరవితేజఇలియానాతరుణ్ అరోరాషాయాజీ షిండేవిక్రమ్ జిత్ విర్క్సునీల్

సంగీతంయస్తమన్

దర్శకత్వంశ్రీను వైట్ల

నిర్మాత : నవీన్ ఎర్నేనివైరవి శంకర్మోహన్ చెరుకూరి

జోనర్ఆక్షన్ డ్రామా

మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మాస్ హీరో రవి తేజ, చాల కాలంగా సరైన సక్సెస్ లేక కష్టాల్లో వున్నా శ్రీను వైట్ల, దాదాపు ఆరు సంవత్సరాలు తరువాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా  కాంబినేషన్ లో వచ్చిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ సినిమా పై అంచనాలు బాగానే వున్నాయి. మరీ ఎంత వరకు ఆకట్టుకుందో చూడాలి.

కథ:

అమెరికా లో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆనంద్ ప్రసాద్సంజయ్  మిత్రలు కలసి ఫిడో ఫార్మా అనే కంపెనీ ని స్థాపించి బాగా డబ్బు సంపాదిస్తారు. ఆనంద్ఆ ప్రసాద్ కు అమర్ అనే కొడుకు ఉండగాసంజయ్ కు ఐశ్వర్య అనే కూతురు ఉంటుంది. ఆ ఫిడో ఫార్మా కంపెనీ లో పని చేసే అరోరాసబు మీనన్విక్రమ్ తల్వార్రాజ్ వీర్ ల నిజరూపం తెలియని ఆ స్నేహితులు వాళ్ళ కంపెనీ లో ఇరవై శాతం షేర్లు ఇచ్చి భాగస్వాముల్నిచేస్తారు. వెంటనే  వాళ్ళు ఆ స్నేహితులనువారి కుటుంబ సభ్యులను చంపి కంపెనీ ని హస్తగతం చేసుకుంటారు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్ అక్బర్ సహాయంతో వారి పిల్లలు మాత్రం తప్పించుకుంటారు. పద్నాలుగు సంవత్సరాలు తరువాత తపించుకున్న అమర్ తిరిగి వచ్చి పగ తీర్చుకుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అమర్ఐశ్వర్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందివాళ్ళు ఎదుర్కున్న కష్టాలుఅస్సలు ఈ అక్బర్ఆంటోనీ లు ఎవరుచివరికి హీరో ఆ దుండగులని చంపడా లేదా అనేదే మిగిలిన కథ.

విశ్లేషణ:

ఈ సినిమా పై అంచనాలు భారీ స్థాయిలోనే వున్నాయి. కానీ ఆ అంచనాలను శ్రీను వైట్ల అందుకోలేదనే చెప్పాలి. సినిమాలో రవి తేజ నటన అందరిని బాగా ఆకట్టుకుందిఇలియానా తన డబ్బింగ్ బాగా చెప్పుకుందిఇక మన కామేడిన్లు బాగానే నటించినవాళ్ళ కామెడీ అంతగ ఆకట్టుకోలేదు. శ్రీను వైట్ల సినిమా ను అనుకున్న విధంగా తెరకు ఎక్కించలేదని  అనిపిస్తుంది. శ్రీను వైట్లరవితేజ కాంబినేషన్ లో కామెడీ బాగా పండుతుందికానీ ఈ సారి మాత్రం ప్రేక్షకులకి కామెడీ విషయంలో కొంత నిరాస ఎదురైంది. నేపథ్యంసంగీతం ఓకేఐతే తమన్ పాటలు మాత్రం వినసొంపుగా లేవు.

ప్లస్ పాయింట్స్:

రవితేజ నటన

ఫోటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

కథ లో కొత్తదనం లేకపోవడం

కామెడీ పండకపోవడం

సంగీతం ఆకట్టుకోలేకపోవడం


రేటింగ్ : 2.25/5


మరిన్ని కథనాలు