అల్లు అర్జున్ బర్త్డే కి కొత్త డైలాగ్

అల్లు అర్జున్ బర్త్డే కి  కొత్త డైలాగ్

 ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ డైలాగ్‌ ఇంపాక్ట్‌ టీజర్‌ని విడుదల చేయనున్నట్టు నిర్మాత లగడపాటి శిరీషా శ్రీధర్‌ తెలిపారు. ఫస్ట్‌ ఇంపాక్ట్‌ టీజర్‌లో ‘చచ్చిపోతాను గాడ్‌ఫాదర్‌. కానీ, ఇక్కడ కాదు. బోర్డర్‌కి వెళ్ళి చచ్చిపోతాను’ అని అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకులపై సినిమా గురించి మంచి ఇంపాక్ట్‌ కలిగించింది. రచయిత వక్కతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ నెల 8న అల్లు అర్జున్‌ బర్త్‌డే సందర్భగా డైలాగ్‌ ఇంపాక్ట్‌ టీజర్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేయనున్నారు. సినిమా మే 4న రిలీజ్‌ కానుంది.