టాలీవుడ్ కథానాయిక గ ఎయిర్టెల్ భామ

టాలీవుడ్ కథానాయిక గ ఎయిర్టెల్ భామ

ఎయిర్‌టెల్‌ 4జీ యాడ్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సషా చెట్రీ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. దర్శకుడు సాయి కిరణ్ అడవి మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు. చిత్రంలోని పాత్రల్లో ఫ్రేష్‌ లుక్ కోసం కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నారట. దీనికోసం జరిపిన ఆడిషన్‌లలో సషా యాక్టింగ్‌ స్కిల్స్‌, డైలాగ్ డెలివరీతో డైరెక్టర్‌ ఇంప్రెస్‌ అయ్యారు . త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్‌కు చెందిన ఈ 19 ఏళ్ల ముద్దుగుమ్మ మోడల్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2015 ఆగష్టులో ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ప్రచార యాడ్‌లో సషాకు అవకాశం రావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికీ తనను అందరూ ‘ఎయిర్‌టెల్‌ గర్ల్‌’ అని పిలుస్తుంటారని సాషా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.