సీనియర్‌ నటుడు వినోద్‌ ఇకలేరు

సీనియర్‌ నటుడు వినోద్‌ ఇకలేరు

సీనియర్‌ నటుడు వినోద్‌(59) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 2 గంటలకు బ్రెయిన్‌స్ట్రోక్‌తో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. పలు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కనిపించిన ఆయన పలు సీరియళ్లలోనూ నటించారు. వినోద్‌ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఇంద్ర, చంటి, నరసింహనాయుడు, లారీ డ్రైవర్‌, మిర్చి తదితర చిత్రాల్లో ఆయన నటించారు. ఫ్యాక్షన్‌ సినిమాల్లో విలన్‌గా అందరికీ సుపరిచితం. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే వినోద్ నివాసానికి వెళ్లి మాఅధ్యక్షుడు శివాజీ రాజా ఆయన మృతదేహానికి నివాళులర్పించారు.