fingoshop
fingoshop

"ఆచారి అమెరికా యాత్ర" మూవీ రివ్యూ

చిత్రం : ఆచారి అమెరికా యాత్ర 

నిర్మాణ సంస్థ‌ : ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్‌

న‌టీన‌టులు : మ‌ంచు విష్ణు, ప్ర‌గ్యా జైశ్వాల్‌, కోట శ్రీనివాస‌రావు, ప్ర‌దీప్ రావ‌త్‌, బ్ర‌హ్మానందం, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను, విద్యుల్లేఖా రామ‌న్‌, రాజా ర‌వీంద్ర‌, అనూప్ సింగ్‌, సురేఖా వాణి, పోసాని త‌దిత‌రులు

సంగీతం : ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

ఛాయాగ్ర‌హ‌ణం : సిద్దార్థ్‌

కూర్పు : వ‌ర్మ‌

మాట‌లు : డార్లింగ్ స్వామి

క‌ళ‌ : కిర‌ణ్‌

నిర్మాత‌లు : కీర్తి చౌద‌రి, కిట్టు

ద‌ర్శ‌క‌త్వ : జి.నాగేశ్వ‌ర‌రెడ్డి

మంచు విష్ణు, నాగేశ్వ‌రరెడ్డి కాంబినేష‌న్‌లో `దేనికైనా రెడీ`, `ఈడోర‌కం-ఆడోర‌కం` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ వీరి కాంబోలో రూపొందిన చిత్రం `ఆచారి అమెరికా యాత్ర‌`. మంచు విష్ణు, బ్ర‌హ్మానందం క‌లిసి కామెడీ చేసిన సినిమాలు మంచి విజయాల‌నే అందుకున్నాయి. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించిందో లేదో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

కథ : కృష్ణ‌మాచారి(మంచు విష్ణు).. అత‌ని గురువు అప్ప‌లాచారి(బ్ర‌హ్మానందం) తో పాటు ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీనుల‌తో క‌లిసి పూజ‌లు, హోమాలు చేయిస్తుంటారు. ఓసారి రాజుగారు(ప్ర‌దీప్ రావ‌త్‌) ఇంట్లో హోమం జ‌రిపించ‌డానికి వెళ‌తారంద‌రూ. ఆ స‌మ‌యంలో ఇంటి పెద్ద( కోట శ్రీనివాస‌రావు) చ‌నిపోవ‌డంతో రాజుగారు అత‌ని త‌మ్ముడు క‌లిసి కృష్ణ‌మాచారి అండ్ కోను చంప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. రౌడీల భారి నుండి త‌ప్పించుకోవ‌డానికి కృష్ణ‌మాచారి అండ్ కో అమెరికా చేరుకుంటారు. అక్క‌డ ఓ పెద్ద కంపెనీ య‌జ‌మాని(అనూప్ సింగ్‌)కి పెళ్లి ముహూర్తం చూడటానికి వెళ‌తారు. అక్క‌డ రేణుక‌(ప్ర‌గ్యా జైశ్వాల్‌)ని చూసి షాక‌వుతారు. త‌ర్వాత ఏమైంద‌నేదే అస‌లు క‌థ‌. అస‌లు రాజుగారు అండ్ కో కృష్ణ‌మాచారిని ఎందుకు చంపాల‌నుకుంటారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : మంచు విష్ణు త‌న పాత్ర‌కు త‌గ్గ న్యాయం చేశారు. కామెడీ పండించే ప్ర‌య‌త్న చేశాడు కానీ క్యారెక్ట‌రైజేష‌న్ బ‌లంగా లేక‌పోవ‌డంతో ఆ పాత్ర, ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ కాదు. ఇలాంటి పాత్ర‌ల‌ను తెలుగు హీరోలు చాలా సినిమాల్లో చేసేశారు. కాబ‌ట్టి ప్రేక్ష‌కుడి కి ఇందులో కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌దు. ప్ర‌గ్యాజైశ్వాల్ పాత్ర‌లో పెర్ఫామెన్స్‌కు స్కోప్ లేదు. ఆమె పాత్ర‌కు ఆమె న్యాయం చేసింది. ఇక బ్ర‌హ్మానందం కామెడీ న‌వ్వించేంత సూప‌ర్బ్‌గా లేదు కానీ.. విసుగెత్తించేంతగా ఉంది. చాలా రోజుల త‌ర్వాత పూర్తిస్థాయి పాత్ర‌లో సినిమా ఆసాంతం బ్ర‌హ్మి క‌న‌ప‌డి త‌న వంతుగా న‌వ్వించే ప్ర‌య‌త్న చేశాడు. 

ప్లస్ పాయింట్స్బ్ర‌హ్మానందం కామెడీ

                          విష్ణు నటన 

మైనస్ పాయింట్స్ : ద్వితీయార్ధం


మరిన్ని కథనాలు

ఆచారి అమెరికా...
కర్తవ్య౦ మూవీ...
Vishnu Manchu Luckkunnodu First look Releasing...
‘నీదీ నాదీ ఒకే కథ’...
‘మెర్క్యూరి’ మూవీ...
విష్ణు మంచు ...
fingoshop