అమిత్‌కు సీక్రెట్ టాస్క్‌... వెక్కి వెక్కి ఏడ్చిన గణేశ్‌

అమిత్‌కు సీక్రెట్ టాస్క్‌... వెక్కి వెక్కి ఏడ్చిన గణేశ్‌

బిగ్‌బాస్‌ సీజన్‌-2 ఏమైనా జరుగొచ్చు అని నాని అన్నట్టుగానే సోమవారం ఎపిసోడ్‌ కొంత ఆసక్తికరంగా.. మరికొంత నిరుత్సాహంగా సాగింది. కామన్‌మ్యాన్‌ గణేశ్‌ కంటతడి పెట్టాడు.

ఎలిమినేషన్‌ కోసం నామినేషన్‌లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఒక వెరైటీ టాస్క్ ఇచ్చారు. ఇంట్లో ఎక్కువ మంది సభ్యులకు ఎవరితో మాట్లాడటం ఇష్టంలేదో చెప్పాలని బిగ్ బాస్ సూచించారు. అయితే ఇంటి సభ్యుల్లో అత్యధికంగా ఏడుగురు సభ్యులు అమిత్‌తో తమకు మాట్లాడటం ఇష్టం లేదని చేతులెత్తారు. దీంతో అమిత్ నేరుగా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇక్కడ అతనికి బిగ్‌బాస్‌ ఓ ఆఫర్‌ ఇచ్చాడు. సీక్రెట్‌ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే ఎలిమినేషన్‌ నుంచి తప్పిస్తానన్నాడు.

కంటెస్టెంట్స్‌లను వారికి ఇష్టమైనవారితో జోడీలుగా విడిపోమ్మని బిగ్‌బాస్‌ సూచించాడు. దీనికి హౌస్‌ మేట్స్‌ గణేశ్‌-దీప్తి, తనీష్‌-దీప్తి సునయన, నందిని రాయ్‌-తేజస్వీ, కౌశల్‌-సామ్రాట్‌, బాబు గోగినేని-రోల్‌ రైడాలుగా విడిపోయారు. బజర్‌లు మోగగానే జంటగా ఉన్న ఇద్దరు చర్చించుకోని ఒకరు విడుదలవ్వాలని, ఇలా విడుదల అయిన వారు సేఫ్‌ అయినట్లు మిగిలినవారు డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌ ప్రక్రియకు నామినేట్‌ అయినట్లు అని పేర్కొన్నాడు. అయితే విడుదల చేసే ముందు కారణం తెలపాలని కూడా చెప్పాడు. 

అమిత్‌కు బిగ్ బాస్  ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ ఏమిటంటే..

సునయనను ఏడిపించాలి, ఎవరైనా ఇంటి సభ్యుడి తలపై గుడ్డు పగలగొట్టాలి, ఎవరైనా ఇంటి సభ్యుడి బట్టలు, షూస్‌ను స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలి, ఎవరైనా ఒక ఇంటి సభ్యుడిని డైనింగ్ టేబుల్‌పై డాన్స్ చేసేలా చేయాలి, వండిన ఒక వంటను పాడుచేయాలి. 

టాస్క్‌లో భాగంగా సునయనను ఏడిపించడం, బట్టలు స్విమ్మింగ్ పూల్‌లో వేయడం, తలపై గుడ్డు పగలగొట్టడం, వంటను పాడుచేయడం.. మొత్తం నాలిగింటిని అమిత్ పూర్తి చేశాడు. అయితే గణేష్ తలపై గుడ్డు పగలగొట్టడంతో రచ్చ మొదలైంది. ‘నామినేషన్‌కు నావైపే వేలు చూపిస్తావా. నా కోపం ఎలా ఉంటుందో చూపిస్తాను’ అంటూ బాత్ రూమ్ వద్ద దీప్తితో పాటు నిలుచున్న గణేష్‌ తలపై అమిత్ బలంగా గుడ్డు పగలగొట్టాడు.  ఈ ఘటనతో హౌస్‌ మేట్స్‌కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గణేశ్‌ అయితే బిత్తర పోయాడు. అప్పటికి దీప్తి ఏదైనా సిక్రెట్‌ టాస్క్‌ అయి ఉండవచ్చని కూడా గణేశ్‌కు సర్ధి చెప్పే ప్రయత్న చేసింది. కానీ గణేశ్‌ మాత్రం బాత్రూంలోకి వెళ్లి మరీ గట్టిగా చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. మరో వైపు కెమెరాల ముందుకొచ్చి అమిత్‌ కంటతడి పెట్టుకున్నాడు. వీళ్లంతా నన్ను అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు టాస్క్‌ ఓడిపోయినా పర్వాలేదని, గణేశ్‌ దగ్గరకు వెళ్లి హౌస్‌మేట్స్‌ అందరికి ఉన్న విషయం చెప్పాడు.

ఈ వారం ఎలిమినేషన్‌కు సామ్రాట్‌, తేజస్వీ, రోల్‌రైడా, దీప్తి, తనీష్‌లు నామినేట్‌ అయ్యారు. సామ్రాట్‌, కౌశల్‌ను సేవ్‌ చేయగా.. తేజస్వీ,..నందును, రోల్‌రైడా.. బాబుగోగినేనిని, తనీష్‌.. దీప్తి సునయనలను కాపాడారు. ఇక సీక్రెట్‌ టాస్క్‌లో ఎక్కువ పనులు అమిత్‌ పూర్తి చేయడంతో నామినేషన్‌ తప్పించుకున్నాడని బిగ్‌బాస్‌ అనౌన్స్‌ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.