2.O మూవీ రివ్యూ

2.O  మూవీ రివ్యూ

సినిమా : 2. O

బ్యానర్ :  లైకా ప్రొడక్షన్స్

నటి నటులు :  రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీజాక్సన్ తదితరులు...

సంగీతం :  ఏఅర్ రహమాన్

ఫైట్స్: సెల్వ

సినిమాటోగ్రఫీ :  నిరవ్ షా

వీఎఫ్ఎక్స్అడ్వైజర్: శ్రీనివాసమోహన్

ఎడిటర్ : ఆంటోనీ

నిర్మాత : సుభాస్కరణ్

స్క్రీన్ ప్లే, కథ ,దర్శకత్వం :  శంకర్

మామూలుగా రజనీ సినిమా వస్తోందంటేనే అభిమానుల సంబరాలకు హద్దులుండవు. ఇక శంకర్‌ కాంబినేషన్‌లో తలైవా వస్తున్నాడంటే బాక్సాఫీస్ కూడా హడలెత్తిపోతుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన శివాజీ, రోబో కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే రోబోకు సీక్వెల్‌గా ఇండియన్‌ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కించిన ‘2.ఓ’ అంచనాలను అందుకుందా? శంకర్‌ మరోసారి తన విజన్‌తో మ్యాజిక్‌ చేశాడా?.. ఇవన్ని తెలియాలంటే ఓ సారి కథలోకి వెళ్దాం...

కథ:

త‌మిళనాడు ద‌గ్గ‌ర ఓ ప్రాంతంలో ముస‌లి వ్య‌క్తి బాధ‌ప‌డుతూ వ‌చ్చి సెల్‌ఫోన్ ట‌వ‌ర్‌కు ఊరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. ప‌క్క రోజు నుండి సెల్‌ఫోన్స్ మాయ‌మ‌వుతూ ఉంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్లు బిల్డింగ్స్ లో నుండి సీలింగ్‌ని చీల్చుకుంటూ మ‌రీ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ పరిణామాలకు కారణాలేంటో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. అలా మాయమైపోయిన సెల్‌ఫోన్స్‌ అన్ని కలిసి ఓ పక్షిలా మరి సెల్‌ ఫోన్‌ వ్యాపారిని, ఓ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఓనర్‌ని దారుణంగా హత్య చేస్తాయి. విష‌యం అర్థం కాక సెంట్ర‌ల్ హోం మినిష్ట‌ర్ సైంటిస్ట్ వ‌శీక‌ర‌ణ్‌(ర‌జ‌నీకాంత్‌)ని క‌లుస్తాడు. వ‌శీక‌ర‌ణ్, త‌న హ్యుమనాయిడ్ లేడీ రోబోట్ వెన్నెల‌(ఎమీజాక్స‌న్‌)తో క‌లిసి సెల్‌ఫోన్స్ ఏమ‌య్యాయ‌నే దానిపై ఆరా తీస్తూ పోతే ఓ నెగ‌టివ్ ఎన‌ర్జీ వ‌శీక‌ర‌ణ్‌పై దాడి చేస్తుంది. అలాంటి నెగ‌టివ్ ఎన‌ర్జీని త‌ట్టుకోవాలంటే సూప‌ర్ ప‌వ‌ర్ కావాల‌ని అందుకోసం చిట్టిని మ‌ళ్లీ యాక్టివేట్ చేస్తాన‌ని అంటాడు వ‌శీక‌ర‌ణ్‌. చివ‌ర‌కు ఆ నెగటివ్ ఎనర్జీ ప్రొఫెస‌ర్ ప‌క్షిరాజు(అక్ష‌య్‌కుమార్) అని తెలుస్తుంది. అస‌లు ప‌క్షి రాజు ఎవ‌రు? అత‌నికి నెగ‌టివ్ ఎన‌ర్జీ ఎందుకు వ‌చ్చింది? సెల్‌ఫోన్స్‌కు, ప‌క్షిరాజుకు ఉన్న సంబంధం ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ:

సెల్‌ఫోన్లకు మనుషులు ఏవిధంగా బానిసవుతున్నారో? దానివల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అన్న అంశాలను భారీగా తెరకెక్కించారు.  విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సినీ ప్రేమికులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సినిమాలో ఎక్కువగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించిన పదాలు వాడటంతో అవి సామాన్య ప్రేక్షకులకు అర్థం కావటం కాస్త కష్టమే. తొలి భాగం  అంతా సెల్‌ఫోన్స్‌ మాయం కావటం, అందుకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం, వసీకరణ్ చేసే ప్రయత్నాలతో సరిపెట్టేసిన దర్శకుడు అసలు కథ, మలుపులను ద్వితీయార్థంలోనే చూపించాడు. పక్షిరాజా ఫ్లాష్‌బ్యాక్‌ ఎమోషనల్‌గా సాగుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇక సుదీర్ఘ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకులు కన్నార్పకుండా చూసే భారీ విజువల్‌ గ్రాఫిక్స్‌తో అలరిస్తుంది. అయితే క్లైమాక్స్‌ ఎపిసోడ్‌లో రజనీ మేనరిజమ్స్‌, అక్షయ్‌ లుక్‌ కనిపించినా పూర్తిగా గ్రాఫిక్స్‌లో రూపొందించిన పాత్రలు మాత్రమే తెర మీద కనిపిస్తాయి. రసూల్‌, రెహమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆడియన్‌ను కథలో లీనమయ్యేలా చేస్తుంది. స్వర మాంత్రికుడు తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయగా.. ఇండియన్‌ సినిమాలో 4డీ సౌండ్‌ టెక్నాలజీని వాడి మరో మాయా ప్రపంచంలోకి రసూల్‌ తీసుకెళ్లారు. నీరవ్‌ షా అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరో ఆకర్షణ. సినిమాలో ఏది గ్రాఫిక్స్‌ ఏది నిజమన్న విషయాన్ని చాలా సన్నివేశాల్లో గుర్తించటం కూడా కష్టమే అంత అద్భుతంగా ఉంది సినిమాటోగ్రఫి. నిర్మాణ విలువలు లైకా ప్రొడక్షన్స్‌ స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ఆంటోని ఎడిటింగ్‌ పనితనం కూడా ఈ సినిమాకు కలిసివచ్చింది.

ప్లస్ పాయింట్స్:

రజిని,అక్షయల నటన 

విసువల్ ఎఫెక్ట్స్ 

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ 

మైనస్ పాయింట్స్:

సాంకేతిక పదజాలం

రేటింగ్:

3.9/5